CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అటవీ హక్కుల చట్టం కమిటీ కాలయాపన కాకుండా పోడు భూమి సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికి హక్కుపత్రాలు ఇవ్వాలి.. మాజీ ఎంపీ మిడియం బాబురావు డిమాండ్..

Share it:


మన్యం టీవీ,  దుమ్ముగూడెం :: పోడు భూములు సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాల్సిందని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ మీడియం బాబురావు డిమాండ్ చేశారు మండలంలోని మల్కపాడు ఎలమంచి సీతారామయ్య భవనంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి పోడు భూముల హక్కుల పత్రాల ఇవ్వాలంటే రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు కలిపి కమిటీ ఏర్పాటు చేయాలని అనడం కాలయాపన చేయడమే తప్ప ఎటువంటి పరిష్కారం చూపే అవకాశం లేదని  తెలిపారు ఇటువంటి సాకులు చూపకుండా వెంటనే పోడు సాగు దారులకు అకుపత్రాలు ఇవ్వాలని కోరారు అలానే గోదావరి ముంపు గురైనటువంటి గ్రామాల కుటుంబాలకు ఎత్తైన ప్రదేశంలో తరలించి ఇల్లు కట్టివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బిల్లులు వరద ముంపు గురైనటువంటి బాధితుల 10 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్ మండల కార్యదర్శి కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు చంద్రయ్య చిలకమ్మా రాజమ్మ సమ్మక్క శ్రీనివాస్ రెడ్డి ఖాదర్ బాబు వీరభద్రం సర్పంచ్ తిరుపతిరావు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: