CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పునరావస కేంద్రాన్ని ఆసరగా తీసుకొని విద్యార్ధితో సంబంధం..

Share it:

 


  • పునరావస కేంద్రాన్ని ఆసరగా తీసుకొని విద్యార్ధితో సంబంధం.. 
  • గత రాత్రి శుక్రవారం ఆశ్రమ పాఠశాల గోడ దూకి వెళ్లిన యువకుడు, సీసీ కెమెరాలు రికార్డు అయినా దృశ్యం.. 
  • తల్లిదండ్రులు పిలిచి విద్యార్థినిని ఇంటికి పంపించిన ప్రధానోపాధ్యాయురాలు.. 

మన్యం టీవీ దుమ్ముగూడెం ::

గోదావరి వరదలు వల్ల గ్రామాలు ముంపు గురి కావడంతో పరివాహక ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలను తరలించే క్రమంలో మంగువాయిబడవ  ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో పునరాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు అయితే దీని ఆసరాగా తీసుకొని కొంతమంది యువకులు విద్యార్థినిలతో మాట్లాడుకోవడం చూడడం అసభ్యంగా ప్రవర్తించడం గమనించిన ఉపాధ్యాయులు అధికారులతో చెప్పి వారిని మందలించారు అయితే ఒక యువకుడు తొమ్మిదవ తరగతి విద్యార్థినిని ఆప్యాయంగా మాట్లాడుకోవడం సాగించారు. గోదావరి వరదలు తగ్గిన తర్వాత పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత కూడా వీరి పరిచయం కొనసాగింది దీనితో విద్యార్థిని తల్లిదండ్రులు వచ్చినప్పుడు  వారి ఫోన్ ద్వారా అబ్బాయికి కాల్ చేసి మాట్లాడడం జరిగేది ఇందులో భాగంగా గత రాత్రి శుక్రవారం యువకుడు గోడదూకి పాఠశాలల లోకి వెళ్లి అమ్మాయితో ఉన్నాడు అటుగా వస్తున్న ఉపాధ్యాయులను చూసి యువకుడు పారిపోయాడు కానీ అతని మొబైల్ అమ్మాయి దగ్గర ఉండిపోవడంతో ఉపాధ్యాయులు స్వాధీనం చేసుకొని సీసీ కెమెరాలు పరిశీలించారు తదనంతరం ప్రధానోపాధ్యాయులకు తెలియజేసి వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి వివరించి మీ అమ్మాయి బుద్ధి మార్చుకోమని చెప్పి మందలించి వారితో ఇంటికి పంపించారు ఇట్టి విషయమే పాఠశాల హెచ్ఎం వీర కుమారి వివరణ అడగ్గా పునరావస కేంద్రంకి వచ్చిన కొందరు యువకులు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే వారిని ఇట్టి విషయాన్ని అధికారులు దృష్టికి కూడా తీసుకెళ్ళమని మొన్న జరిగిన విషయాన్ని ఐటిడిఏ డిడి రమాదేవి ఏటీడీఓ నరసింహారావు తెలియజేసి విద్యార్థిని వారి తల్లిదండ్రులు పిలిచి ఇంటికి పంపించామని తెలిపారు అయితే గత కొంతకాలంగా అబ్బాయి వస్తున్న సిబ్బందికి తెలియకపోవడం ఏమిటని అలానే మండలంలో రామచంద్రుని పేట పాఠశాలలో జరిగిన సంఘటన కే రేగుబల్లి  పాఠశాలలో సంఘటన మరువక ముందే ఇలాంటివి సంఘటన పునవృతంకావడం ఆశ్రమ పాఠశాలలో పిల్లలకి భద్రత లోపించిందని తెలుస్తుంది చాలావరకు ఆశ్రమ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు రాత్రిపూట కాపలా ఉండడం లేదని తెలుస్తుంది.

Share it:

TELANGANA

Post A Comment: