👉 స్థానిక అడపచులతో బతుకమ్మ సంబరాలు
👉 దళిత బంధు యూనిట్ ప్రారంభం
ములకలపల్లి :(సెప్టెంబర్ 24)మన్యం మనుగడ ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను ములకలపల్లి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరాల పంపిణి కార్యక్రమం లొ పాల్గొని ఆడపడుచులతొ కలిసి బతుకమ్మ ఆడారు, అనంతరం స్ధానిక ప్రజా ప్రతినిదులతొ కలిసి అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఇటీవలే హార్ట్ సర్జరీ చేపించుకొనీ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న తోకల గోపయ్యను పరామర్శించి మనోధైర్యం నింపారు. మాధారం(గ్రామం),లో దళిత బంధు యూనిట్ నీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతికైన బతుకమ్మ పండుగకు ప్రతి ఇంట్లో ఆనందాలు విరజిమ్మాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు చిరు కానుకగా,చీరలు ఇస్తున్నారనీ,అందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలనీ ,ఏ రాష్ట్రం లో లేని అభివృద్ధి మన రాష్ట్రంలో ఉందని తెలియజేసారు.ఈ సందర్బంగాములకలపల్లి(మండలం),మంగపేట PHC లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కి 1కోటి 50లక్షలు మంజూరు చేపించానని ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వంమని,ఈ అభివృద్ధిని ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పై ప్రతి విషయంలో చిన్న చూపు చూస్తుందని,మనం అందరం జీవితాంతం ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని,రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి గా కేసీఆర్ ని గెలిపించాలని ,రాష్ట్రం కోసం ఎలాంటి స్వార్దం లేకుండా పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
,ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తాశిల్దార్ ఎల్ వీరభద్రం,ఎంపిడివో చిన నాగేశ్వరావు, జెడ్పిటిసి సున్నం నాగమణి,ఎంపీపీ మట్ల నాగమణి,ములకలపల్లి ఎంపీటీసీ సేనగపాటి మెహర్ సీతారాములు, సర్పంచ్ లు కారం సుధీర్,వాడే నాగరాజు,బైటి రాజేష్,సున్నం సుశీల,గడ్డం భవాని,గొల్ల పెంటయ్య,టీఆరెఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోరంపుడీ అప్పారావు,నాగళ్ళ వెంకటేశ్వరరావు,సెనగపాటి అంజి,మగపతి,సురభి రాజేష్,చందర్ రావు,అమర్నాథ్,రాజా రావు,బండి కొమరయ్య, గుంట్రు సాయి, నందమూరి సురేష్,బొంతు నందు, పామర్తి వెంకటేశ్వరరావు,మండల యువజన విభాగం అధ్యక్షుడు తాటి ప్రవీణ్, మోట రవి,ఏసుపక వెంకటేశ్వర్లు,పత్తి బిక్షం,రాజు,రింగు బాలకృష్ణ,భాస్కర్,దేవళ్ళ బిక్షం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: