CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళితుల ఆర్థిక అభివృద్ధి కోసమే దళిత బంధు పథకం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

Share it:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు : మండలం,అశోక్ నగర్ లోని గిరిజన భవన్ నందు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, అధ్యక్షతన జరిగిన పినపాక నియోజకవర్గం మొదటి విడత 100 మంది లబ్ధిదారులు,అన్ని మండలాల ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు,అన్ని మండలాల వారితో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,దళితులను ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారిని ఆదుకుంటున్నారు అని తెలిపారు.తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.విడతల వారీగా ప్రతి ఒక్కరికి దళిత బంధు అందుతుందన్నారు. దళిత బంధు తో దళిత ల జీవితాల్లో వెలుగులు నిండాలని అన్నారు.సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో  దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి అకౌంట్ లో జమ చేస్తున్నదని తెలిపారు.ప్రభుత్వ సహకారంతో 30 రకాల వివిధ వ్యాపారాలను చేసుకుని జీవితంలో ఎదగాలనే  సంకల్పంతో  తోడ్పాటు ను అందించేందుకు తగు చర్యలు ప్రభుత్వం,తీసుకుంటుందన్నారు.తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళిత సాధికారత తెచ్చిన మహోన్నతుడు మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు.దళితులు ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు దళితులంతా రుణపడి ఉంటారన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అని, దళిత బంధు పథకంతో అనేక దళిత కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.దళిత బంధు పథకం దళితులను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడంతో పాటు ఐక్యతకు నిదర్శనం గా మారిందని ఆయన పేర్కొన్నారు.దళిత బంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసి ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.ఇది ఎంతో అద్భుతమైన పథకమని ఇటువంటి పథకం గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.ఇంత గొప్పగా విజయవంతం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను సక్రమంగా వినియోగించుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,మండల అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,ఎస్సీ సెల్ నాయకులు, అభిమానులు,పార్టీ ముఖ్య నాయకులు,పార్టీ యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,టిఅరెస్వి నాయకులు,దళిత బంధు లబ్ధిదారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: