CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:

 


మన్యం టివి , మణుగూరు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని తాసిల్దార్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శనివారం నాడు నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 16 నుండి 18 వరకు మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసేదెందుకు ఏర్పట్ల పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను,పురస్కరించుకొని సెప్టెంబర్ 14 నుండి 18వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,ప్రముఖ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించేలా చూడాలన్నారు.ముఖ్యంగా, ముఖ్యంగా 16వ తేదీన నియోజవర్గ కేంద్రాల్లో కనీసం 15,000 మందితో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ,భారీ ర్యాలీ నిర్వహించాలని సూచించారు.ప్రతి మున్సిపల్ వార్డు నుంచి అన్ని వర్గాల ప్రజలు,ప్రజా పరిషత్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.17 వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాలను ఎగరవేయాలని సూచించారు. అదే రోజున జిల్లాలోని గిరిజన తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు,ఉద్యోగులు,విద్యార్థులను పెద్ద ఎత్తున మధ్యాహ్నము 1:30 గంటల వరకు హైదరాబాదుకు ప్రత్యేక వాహనంలో తరలించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.వారికి అల్పాహారం భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.18 వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అని, సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయం పెంపొందించుకొని సమిష్టి కృషితో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు, స్ధానిక జెడ్పీటీసీ పోశం. నర్సింహారావు,తహశీల్దార్ నాగరాజు,డిఎస్పీ రాఘవేందర్ రావు,ఎంపీడీఓ వీరబాబు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: