CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎక్సలెంట్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

Share it:


మన్యం మనుగడ,పినపాక:

తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ సంబరాలను పినపాక మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు.

పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోగల ఎక్సలెంట్ భాష హైస్కూల్లో  శనివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో బాలికలు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆట పాటలతో విద్యార్ధినిలు హోరెత్తించారు. ఆదివారం అమావాస్యతో బతుకమ్మలతో ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలా బాలికలు అందరూ కలిసి సామూహికంగా తమ పాఠశాలలో సంబరాన్ని ఆనందోత్సాహాలతో జరిపారు. ఈ కార్యక్రమంకు ఎక్సెలెంట్ విద్యా సంస్థ చైర్మన్ యూసఫ్ షరీఫ్ పాల్గొని విద్యార్థులతో కలిసి బతకమ్మ ఆటలు ఆడారు. విద్యార్థులను  ఉపాధ్యాయులు బతుకమ్మ ఆటలు ఆడే విధంగా ప్రోత్సహించారు. విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను సర్వాంగా సుందరంగా అలంకరించి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.బతుకమ్మ ఉత్సవాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మలను పేర్చి అందంగా విద్యార్థులు అలంకరించారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయురాళ్లు సైతం ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కోలాటాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో  ఎక్సెలెంట్ విద్య సంస్థల చైర్మన్ ఎండీ యూసఫ్ షరీఫ్, డైరెక్టర్స్ ఎండీ ఖాదర్, యాకుబ్ షరీఫ్, ముక్కు నర్సారెడ్డి, బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ సురేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు  పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: