మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపతిరావుపేట గ్రామానికి చెందిన అలవాల కృష్ణమూర్తి ( 50 )అనే వ్యక్తి మరణించాడు. భూపతిరావుపేట గ్రామస్తులు తెలిపిన ప్రకారం శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో భూపతిరావుపేటలోని ఇసుక ర్యాంపు నందు లారీలకు పట్టాలు కట్టడానికి అందరూ కూలీలతో పాటు తాను అక్కడికి వచ్చినట్టు తెలియజేశారు. అకస్మాత్తుగా ఆయాసం రావడంతో చెట్టు కింద కూర్చుని కుప్పకూలినట్లు తోటి కూలీలు తెలియజేశారు. ఆయన మృతి పట్ల భూపతి రావు పేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Post A Comment: