CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించిన విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి..

Share it:


మన్యం టివీ, దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి హైదరాబాదులో నాంపల్లి లోని కమిషనరేట్ నందు కొండ సాయి తేజ, మండలోజు యువ శ్రీ కృష్ణ సాయి ఇరువురు విద్యార్థులను ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ కుమార్ జలీల్ తో కలిసి సన్మానించారు ఈ సందర్భంగా ప్రతి ఏటా మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఇచ్చే 20000 రూపాయల నగదును ఇరువురికి అందజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఈ ప్రతిభ పురస్కారానికి విద్యార్థులు ఎంపిక అవ్వడం పట్ల జిల్లా డి ఏ ఈ ఓ సులోచన కళాశాల ప్రిన్సిపల్ ఎల్ వెంకటేశ్వర్లు అధ్యాపకులు బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన విద్యార్థులను అభినందించారు అలానే కళాశాల మీద నమ్మకంతో తమ బిడ్డలను చేర్చుతున్న తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు కళాశాలలో అనుభవిజ్ఞులైన అధ్యాపక బృందం తో పాటు విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం కాకుండా మానసిక వ్యక్తిత్వం సృజనాత్మక కార్యక్రమాలు క్రీడలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సహించడం ద్వారా మంచి ఫలితాలు సాధించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు

Share it:

TELANGANA

Post A Comment: