CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళలకు రక్షణ మానవీయ మార్పే. - బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

Share it:



  •  మహిళలకు రక్షణ మానవీయ మార్పే. 
  • - బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన  కలిగి ఉండాలి.
  • సిడిపిఓ వెంకటాపురం ముత్తమ్మ
  • బాలల హక్కులు, చట్టాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
  • జిల్లా బాలల పరిరక్షణ అధికారి, ఓంకార్ ములుగు జిల్లా.

మన్యం మనుగడ సెప్టెంబర్ 20 వెంకటాపురం.

మంగళవారం వెంకటాపురం మండల కేంద్రం లోని కాపీడ్ సంస్థ ఆవరణ లోని సమావేశ మందిరం లో బాలలు మరియు మహిళల  పరిరక్షణ కోసం పని చేస్తున్న కాఫీడ్ సిబ్బంది మరియు గ్రామ స్థాయి వాలంటీర్లకు "బాలలు మరియు మహిళా హక్కుల పరిరక్షణ చట్టాల పై ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం" నిర్వహించడం జరిగింది.


       ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటాపురం  సిడిపిఓ ముత్తమ్మ  మాట్లాడుతూ  మహిళలు, పిల్లల పై నేటి రోజుల్లో ఎన్నో వేధింపుల జరుగుతున్నందున ప్రతీ ఒక్కరు సంబంధిత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు,పిల్లల అభివృద్ధికి ఎన్నో చట్టాలు తీసుకు వచ్చాయని కావున ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి లబ్దిపొందాలని సూచించారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లో మహిళలు, పిల్లలపై పని చేస్తున్న కాఫీడ్ సంస్థ వారు తమ సిబ్బంది వాలంటీర్లకి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం  ఓంకార్ మాట్లాడుతూ  ఒక్కరోజు శిక్షణ లో భాగంగా మహిళలు, పిల్లల హక్కుల పరిరక్షణ చట్టాలైన బాలల న్యాయ చట్టం, లైంగిక నేరాల నుండి బాలలను రక్షించే చట్టం, దత్తత, వరకట్న నిషేద, గృహ హింస నిషేధ చట్టం, పని ప్రదేశాల్లో మహిళల పై లైంగిక హింసను నిరోధించే చట్టం వంటి చట్టాలను గురించి శిక్షణ లో పాల్గొన్న వారికి శిక్షణ అందిస్తామని తెలిపారు. అదేవిధంగా బాలల పరిరక్షణ  విభాగాలైన బాల రక్ష భవన్, మహిళా పరిరక్షణ విభాగాలైన సఖి, ల సేవల గురించి క్షేత్ర స్థాయి లో వాటిని వినియోగించుకునే విధానం గురించి తెలిపారు. మారుమూల ప్ప్రాంతాలని కలిగి ఉన్న వాజేడు, వెంకటాపురం మండలాల్లో క్షేత్ర స్థాయి లో బాలలు మరియు మహిళా హక్కుల పరిరక్షణ లో ఈ శిక్షణ ఎంతో ప్రయోజనకరం గా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వెంకటాపురం ఏ ఎస్ ఐ రామ చంద్రం  మాట్లాడుతూ పిల్లలు, మహిళా హక్కుల పరిరక్షణ లో క్షేత్ర స్థాయిలో పోలీసు శాఖ సహకారం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. అనంతరం కాఫీడ్ సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూర్థు రాజు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో మహిళలు, పిల్లల హక్కులపై పని చేస్తున్న మా సంస్థ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నందుకు మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికార యంత్రయంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 


        చట్టాలపై రిసోర్స్ పర్సన్లు హరికృష్ణ, సంజీవ, మౌనిక, ప్రణయ్ ప్రసాద్ లు  బాలల & మహిళా హక్కుల పరిరక్షణ చట్టాలపై పాల్గొన్న సిబ్బంది & గ్రామ స్థాయి వాలంటీర్లకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాఫీడ్ సంస్థ వారు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: