CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా భగత్ సింగ్ జయంతి

Share it:

 


ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమర యోధుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అసమాన దేశభక్తుడు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్బంగా అమర వీరుడికి ఘనంగా నివాళులర్పించారు.

మన్యం మనుగడ, ఏటూరు నాగారం :

ఏటూర్ నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు, జిల్లా నాయకులు ఖలీల్ ఖాన్, మండల బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు భగత్ సింగ్ జయంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.మండల అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతూ.భగత్ సింగ్ అతి చిన్న వయసులో భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.

విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు.ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడ బడుతున్నాడు.విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటీష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది. భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయ డం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.ప్రజాహితం కోసమే నంటూ ప్రత్యేక శాసనం కింద ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది.బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు.అయితే సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు అతనుపై ఒత్తిడి తీసుకొచ్చారు.అలా వారు పట్టుబాడతారు.అరెస్టు అనంతరం విచారణలో భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్,శాసనసభ పేలుడు పై విచారణ చేపట్టగా న్యాయ స్థానంలో నేరాన్ని అంగీకరిస్తారు

న్యాయస్థానం వారికి ఉరిశిక్షను అమలు చేస్తుంది,భగత్ సింగ్ ని ఉరి తీసే ముందు ఆఖరి కోరిక అడగితే అతను ఉరిశిక్ష నిరాకరిస్తూ నాకు భారత మాత భూమిలో నా రక్తం చిందిస్తూ,నా దేహం భూమిని తాకుతూనేను భారత భూమి ముద్దాడాలని,నా రక్తం భరత భూమి ఒడిలో పడితే వేలాది భగత్ సింగ్ లు పుడతారని అన్నారు ఒక చేయ్యి గురు నానక్ మీద మరో చేయ్యి సుఖ్ దేవ్ మీద వేస్తూ భారత మాత కి జై కొడుతూ చనిపోతానని తుపాకి తూటాలతో  కాల్చి చంపమని కొరుతాడు.కానీ 

బ్రిటిష్ ప్రభుత్వం అతని కోరిన నిరకరిస్తుంది.ఇంతలో 23వ తేదినా వేలాది మంది భారతీలు జైలును చుట్టూ ముడితే బ్రిటిష్ ప్రభుత్వం దొంగ చాటున జైలు వెనుకాల కాల్చి చంపుతారని అన్నారు.

భారతదేశం గర్వించేదగా విప్లవకారుడు అతనికి ఇవే మా జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఖలీల్,మండల బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు, ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి కొండగొర్ల పోషయ్య, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్,వర్కింగ్ టౌన్ అధ్యక్షులు  సరికొప్పుల శ్రీనివాస్, జిల్లా యూత్ కార్యదర్శి ఎండి గౌస్,మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం, మండల సోషల్ మీడియా ఇంచార్జి సోదారి హరీష్,

మధుబాబు,జిమిడా రవి,ఉమ్మనేని రమేష్,

సాధనపల్లి లక్ష్మయ్య,

మామిడి రాంబాబు,పడిదల హన్మంత్,దుర్గం అర్జున్,

కళ్యాణ్,కొండగొర్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: