CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలోని పలు సమస్యలపై ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు తెలియజేసిన ప్రజా ప్రతినిధులు...

Share it:


మన్యం టివి, దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలంలోని ఉన్నటువంటి వివిధ సమస్యలపై కొత్తగూడెంలోని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు కార్యాలయంలో మండల టిఆర్ఎస్ పార్టీ బృందం సమస్యలను వినిపించుకున్నారు మండలంలోని  రహదారులు పోడు భూముల పట్టాలు విషయంపై ఆయనకు వినత పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్డిఎఫ్ నిధుల నుండి మంజూరైనటువంటి కొత్తపల్లి నుండి గుధమడుగు వరకు, గోవిందపురం నుండి బక్క చింతలపూడు వరకు, మొలకపాడు అడ్డరోడ్డు నుండి లక్ష్మీపురం వరకు రోడ్డు నిర్మాణాలు చేయుటకు నిధులు మంజూరైనని తెలిపారు అదే విధంగా పొడు సాగుదారులకు ఎటువంటి ఆంక్షలు లేకుండానే ప్రతి కుటుంబానికి 10 ఎకరాలు చొప్పున పట్టాలు ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు అదే విధంగా కొత్తగా పోడు పేరుతో అడవులను నరికితే  చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు . త్వరలోనే మండల పర్యటనకు వస్తానని సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి కనితి రాముడు, జడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, ఎంపీటీసీలు భీమరాజు, తిరుపతిరావు ,పార్టీ నాయకులు దామెర్ల శ్రీనివాసరావు, జై సింహా ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మోతుకూరి శ్రీకాంత్, విద్యార్థి విభాగం పార్టీ అధ్యక్షులు కొత్త మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: