మన్యం మనుగడ. కరకగూడెం: గత 64 రోజుల నుండి వీఆర్ఏలు చేస్తున్న నిర్వారధికా సమ్మె చేస్తున్న సంగతి పాఠకులకు తెలిసినదే దీనిలో భాగంగా వీఆర్ఏలకు రెండు నెలల నుండి జీతాలు లేక ఇంట్లో పూట నడవడానికి కష్టంగా మారిన విషయం తెలుసుకున్న కరకగూడెం తహశీల్దారు ఉషా శారద తన మానవత్వంతో విఆర్ఏ లకు బియ్యం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు నెలల నుండి వీఆర్ఏల చేస్తున్న సమ్మెలో భాగంగా తమ డిమాండ్లు నెరవేర్చెంతవరకు దీక్ష విరమించేది లేదంటూ మొండి వైఖరి మీద ఉన్న వీఆర్ఏలకు ఇంట్లో పూట గడవడం కష్టంగా ఉందని నా దృష్టికి రావడంతో వారికి నా వంతుగా బియ్యం నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు తహశీల్దారు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: