CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్రికెట్, వాలీబాల్ కిట్లను పంపిణీ చేసిన ఎంపీపీ

Share it:


మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని భూపాలపట్నం గ్రామపంచాయతీలో భూపాలపట్నం,ఐలాపురం గ్రామాలలో సర్పంచ్ కొర్సా కృష్ణంరాజు ఆధ్వర్యంలో భూపాలపట్నం గ్రామ పంచాయతీ యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లను పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఇతర గ్రామాలతో ఆటలు ఆడేటప్పుడు స్నేహ పూర్వకంగానే ఆడాలని, అలా ఆడినప్పుడే మనలో ఉన్న సోదరభావం పెంపొందుతుందని గుర్తు చేశారు. ఈ  కార్యక్రమంలో ఎంపీటీసీ కుమారి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డి, యూత్ సభ్యులు తోట మల్ల అనిల్, వాగబోయిన వినోద్ కుమార్, బొగం కళ్యాణ్, గుండ్ల రాము, సీతారాం, సల్ల అనిల్, బాదే సాయి కుమార్, సర్వేశ్,  సభ్యులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: