మన్యం టీవీ , దుమ్ముగూడెం ::
తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సమస్యల పరిష్కారం కొరకు జీవో నెంబర్ 140 ద్వారా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అట్టి జీవోలో పేర్కొన్న విధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఆదివాసి సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని ఆదివాసి సేన మండల కన్వీనర్ కొరసా నరేష్ డిమాండ్ చేశారు జీవో నెంబర్ 140 పోడు భూములపై హక్కుల కల్పన విషయంలో సరైనటువంటి దిశా నిర్దేశం చేయాలని కోరారు అలానే అటవీ భూములపై సర్వ హక్కులు ఆదివాసులకు ఉన్నాయని ఆ హక్కుల గుర్తించి హక్కులు కల్పించేటటువంటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాడుతున్నాయని ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవరణ చేస్తూ స్పష్టమైన విధి విధానాల్లో అటువక్కుల చట్టస్ఫూర్తిగా లోబడి ఆదివాసి భాగస్వామ్యం ఉంటూ సమస్య పరిష్కరించే విధంగా రోడ్డు మ్యాప్ రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీసాన మండల అధ్యక్షులు కాటిపోయిన శ్రీను జిల్లా కో కన్వీనర్ కారం రమేష్ రైతు సేన నాయకులు కొరుస శ్రీను శెట్టిపల్లి శ్రీను ఆదివాసి సేన మండల నాయకులు వెంకటేష్ ప్రసాదు హరీష్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు
Post A Comment: