CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీకి పతనం తప్పదు.. దళిత హిందూ సంఘం వ్యవస్థాపకులు జెట్టి వెంకటరాజు..

Share it:

 

మన్యం టీవీ, దుమ్ముగూడెం ::

దళితులను మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీకి పతనం తప్పదని దళిత హిందూ మాలనాడు సంఘం వ్యవస్థాపకుడు జెట్టి వెంకటరాజు అన్నారు. మండలంలోని రేగుబల్లి గ్రామంలో జోగారావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లకాలువ లాంటి అవకాశవాద పార్టీలు ఎన్ని తోడైన కేసీఆర్ కి ఓటమి తప్పదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర జనాభా మీద అప్పుల భారం పడిందన్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాలను, హిందుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తుందన్నారు. తెలంగాణలో బ్రాందీ షాపులకు పర్మిషన్లు ఇచ్చి, ప్రజలు మద్యానికి అలవాటు పడి  జీవనాధారం కోల్పోయి ప్రజలు నాశనం అవుతుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనందిస్తుందని విమర్శించారు. రానున్న కాలంలో టిఆర్ఎస్ ఓటమి తప్పదని, రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి జోగారావు, నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: