CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భీమ్ రామ్ ఆర్మీ అధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

Share it:




మన్యం మనుగడ, అశ్వారావుపేట: స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు భీమ్ రామ్ ఆర్మీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు, ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడని అన్నారు. ఆయని పోరాట స్తూర్తి నేటి యువతకు అవసరమని రానున్న రోజుల్లో ఇంటికి భగత్ సింగ్ లా యువత అవతరించి దేశానికి సేవలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిప్లలి శ్రీరామ మూర్తి, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, మల్లాయిగూడెం సర్పంచ్ నారం రాజశేఖర్, అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, ఉట్లపల్లి సర్పంచ్ సాదు జోష్నా భాయ్, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా డివిజన్ నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు సయ్యద్ సలీం, టీడీపీ పార్టీ నియోజక వర్గ కన్వీనర్ కట్రం స్వామి దొర, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు, తెరాస పార్టీ నాయకులు కలపాల శ్రీనివాసరావు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎస్కె పాషా, కొల్లు వెంకటరమణ, తెరాస పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, వార్డ్ సభ్యులు చిప్పనపల్లి శ్రీను, పసుపులేటి ఫణీంద్ర, బొడ్డపాటి ప్రసాద్, నార్లపాటి శుదర్శన్ రావ్, చిప్పనపల్లి బజరయ్య, శ్యామ్ సుందర్,గౌడ సంఘం అధ్యక్షులు తాళం సూరిబాబు గౌడ్, మోటూరి మోహన్, ఆకుల శ్రీను, నందికోల వెంకన్న బాబు,ధర్మ రాజు,అవుల చిన్ని, తగరం రాంబాబు, భీమ్ రామ్ ఆర్మీ  కార్యవర్గ సభ్యులు గంధం ఆనంద్, బొడ్డపాటి ఉదయ్,నార్లపాటి సురేష్, తగరం హరి, ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: