మన్యం మనుగడ సెప్టెంబర్ 27 వాజేడు. : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖో ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22వ తేదీన సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలకు కాటారం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణాపురం గ్రామం, వాజేడు మండలం, ములుగు జిల్లా, పూణెం తేజస్, కాటారం, గిరిజన గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి, విద్యను అభ్యసిస్తున్నారు. సెప్టెంబర్ 28,29, 30, తేదీలలో మహబూబా నగర్, జిల్లా, జడ్చర్ల లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్, పిడి, శ్రీనివాస్, వెల్లడించారు. ఎక్కడో జనవాసాలకు దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసి బిడ్డ రాష్ట్రస్థాయి పోటీలలో రాణించడం వాజేడు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మన్నెంలో కూడా మాణిక్యాలు ఉన్నాయి అని పూనెం తేజస్ నిరూపించారు.
Post A Comment: