మన్యం మనుగడ, మంగపేట. :
మంగపేట మండలం రాజుపేటలో దళిత యువత ఆధ్వర్యంలో నిర్వహించిన దళితుల సమగ్ర అభివృద్ధి సమావేశం లో బాగంగా దళిత నిరుద్యోగ యువత పత్రిక కు ఇచ్చిన ప్రకటన లో తమ ఆవేదనను వెల్లబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు సెకండ్ ఫేస్ లో అయినా కనీసం డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక, రాక, కండ్లు కాయలు కాసేలా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు దళిత బంధు ఇవ్వాలని దళిత నిరుద్యోగ యువత కోరారు. ప్రభుత్వం ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం సహకారాలు అందిస్తూనే ఉంది కానీ నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరగటం లేదు, నిరుద్యోగ యువత అటు ఉద్యోగం రాక ఇటువైపు ప్రభుత్వం ప్రకటించిన ప్రతిఫలాలు అందక అన్ని విధాలుగా నష్ట పోతున్నన్నారు. ఈ విషయం ప్రభుత్వం గ్రహించి ప్రతి దళిత నిరుద్యోగి కి దళిత బంధు ఇచ్చి వారికి చేయతను ఇవ్వాలని దళిత నిరుద్యోగ యువత కోరారు.
Post A Comment: