CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంతర్ రాష్ట్ర సంబంధాలు బంద్.

Share it:


*గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది.

*వాజేడు మండలం మళ్లీ జలదిగ్బంధంలోనే.

*సహాయక చర్యలు తీసుకోవాలని పై అధికారుల ఆదేశాలు.

*ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి.

మన్యం మనుగడ వాజేడు సెప్టెంబర్ 13. :

గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకి గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతమైన వాజేడు మండలం లో మళ్లీ వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. వాజేడు మండలం టేకులగూడెం గ్రామ పరిధిలో163 వ జాతీయ రహదారినీ గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో   అంతరాష్ట్ర సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలు స్తంభించయి.గత మాసంలో వరదలు వచ్చి గ్రామాలకు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి క్రమంగా ఇల్లు చక్కబెట్టుకునే క్రమంలో మళ్లీ వరదలు రావడం ఇల్లు, గ్రామాలు ముంపుకు గురి కావడం, ఇల్లు కూలిపోయి, దిక్కు తోచని పరిస్థితులలో బిక్కుబిక్కుమంటున్నారు. స్థానిక ప్రజలు, మళ్లీ వరద ప్రవాహం రావటంతో వాజేడు ఏజెన్సీలో ప్రజల పరిస్థితి అయోమయంలో పడింది.



 వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త లు.


 గోదావరి వరద ప్రవాహానికి దోమలు, ఈగలతో, సీజనల్ వ్యాధులు, మలేరియా, టైఫాయిడ్ ,డెంగ్యూ, వంటి జ్వరాలతో ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. వాజేడు ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది.ప్రభుత్వంవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న వ్యాధులు పెరుగుతున్నాయి. గ్రామ పంచాయతీవారు ముప్పు గ్రామాలలో దోమల మందు పిచికారి చేయటం, బ్లీచింగ్ పౌడర్ పిసికారి, దోమలకు పాగింగ్, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ని కార్యక్రమాలు చేసిన వరద ప్రవాహం కారణంగా వ్యాధులు ప్రబలడం మాత్రం ఆగడం లేదు, గ్రామాలలో ప్రజలు స్వీయ పరిశుభ్రత నియంత్రణ పద్ధతులు పాటించాలి. తద్వారా వ్యాధులు ప్రబలకుండా మనల్ని మనము రక్షించుకొనుటకు   ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పై అధికారుల ఆదేశాలు.



ఆస్తి ప్రాణ నష్టం ముందస్తు చర్యలు.


గోదావరి పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతాలు నిత్యం జలమాయమయ్యే ప్రాంతాల గ్రామాలను గుర్తించి ప్రభుత్వ సహాయక చర్యలు చేపట్టాలి. గ్రామాలలో ఆస్తి నష్టం కాని ప్రాణ నష్టం కానీ జరగకుండా ముందస్తుగా ప్రణాళిక బద్దంగా వ్యవహరించవలసిందిగా మండల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

ప్రధానంగా వాజేడు గోదావరి ముంపు ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

 మండలంలో ఆస్తి నష్టం జరిగిందనీ, ప్రభుత్వం అంచనా వేసి ముంపునాకు గురి అయిన బాధ్యులకు లేక ప్రజలకు ప్రభుత్వ పరమైన పారితోషికం విషయంలో సమాన న్యాయం చూపవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.  వరద వచ్చిందంటే చాలు ఇల్లు గుల్ల చేసి పోతుంది. ఆదివాసి లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ప్రభుత్వం స్పందించి వరద ప్రవాహానికి ఇల్లు ముంపునకు గురయ్యే గ్రామాలలో శాశ్వత పరిష్కారాన్ని చూపాలని ముంపు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: