మన్యం టివీ, దుమ్ముగూడెం::
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజా విధానాలను ప్రజలపై అమలు చేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా తను మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు అలానే రోజురోజుకు పెరిగిపోతున్న నెత్యవసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ తగ్గించాలని డిమాండ్ చేశారు అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి ఆదినారాయణ కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసి గత రెండు నెలల క్రితం వచ్చిన భారీ వర్షం కారణంగా ముంపు గురైనటువంటి వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే 10000 రూపాయల నష్టపరిహారం కొంతమంది బాధితులకు అందలేదని వాళ్లకి వెంటనే నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య సభ్యురాలు సర్పంచ్ సరియం రాజమ్మ మండల నాయకులు కృష్ణమూర్తి పున్నారావు బుజ్జి కళ్యాణ్ శ్రీను సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: