CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగన్వాడి సెంటర్ కు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ టీవీ వితరణ

Share it:


మన్యం మనుగడ, దమ్మ పేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల పరిధిలోని మారప్పగూడెం పంచాయతీ దిబ్బగూడెం గ్రామం గల అంగన్వాడీ కేంద్రానికి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీవీ నీ వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఐసిడిఎస్, దమ్మపేట సిడిపిఓ జ్యోతి పాల్గొని టీవీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో పిల్లలుకు ఆటలు పాటలతో విద్య అందుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంగన్వాడి సెంటర్ కు ఫ్యాన్ లను కరెంటును ఏర్పాటు చేశారు, అనంతరం ప్రజా ప్రతినిధులు తమ గ్రామం గల అంగన్వాడి సెంటర్ కు కుర్చీలను ఇంకొక ఫ్యాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ముత్యాలరావు ఎంపీటీసీ చలపతిరావు సూపర్వైజర్ హైమావతి, లిల్లీ పుష్ప అంగన్వాడి టీచర్ తిరుపతమ్మ, కొర్శా వెంకటేశ్వరావు, పూనేమ్ గోపాలరావు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: