CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వరావుపేట లో ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రం అశ్వరావుపేటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుక ప్రారంభం రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు మేరకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా మరియు అశ్వరావుపేట నియోజకవర్గం ఐదు మండలాల నాయకులు, అధికారులు, ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు అందరూ సుమారు పది వేల మందితో అశ్వరావుపేట రింగ్ రోడ్డు వద్ద నుండి సమావేశం ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ కళాశాల వద్దకు జాతీయ జెండాలు పట్టుకొని భారీ ర్యాలీగా చేరుకోవడం జరిగింది. ఆనంతరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే మెచ్చా ప్రసంగిస్తూ ముందుగా పిలుపు మేరకు బారి సంఖ్యలో తరలి వచ్చిన ప్రతి అక్కకు చెళ్లకు అన్నకు తమ్ముడు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.1947 సంవత్సరంలో భారతానికి స్వతంత్రం సిద్ధించినప్పటికీ తెలంగాణ మాత్రం రజాకార్ల నిర్బంధంలో అల్లాడిందని నాటి సాయుధ పోరాట వీరుల త్యాగాల ఫలితం సర్దార్ వల్లభాయ్ పటేల్, 1948 సెప్టెంబర్ 17న మిలిటరీ సైన్యంతో తెలంగాణకు రావడంతో తెలంగాణ ప్రజలు పూల వర్షంతో  భారత ఆర్మీ ని ఆహ్వానించడంతో నిజాం రాజు, తలోంగి భారతావనికి తెలంగాణ రాష్ట్రానికి అప్పగించారని. తెలంగాణ అంటేనే పోరాటాల పురిటగడ్డ అని తెగువకు వెనకాడని నైజం ఉన్నవారే తెలంగాణ ముద్దుబిడ్డలని అన్నారు ఉద్యమాలు మన గడ్డకు కొత్త కాదని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పటి నుండి హక్కుల కోసం కొట్లాడుతూనే ఉన్నామని, సీఎం కేసీఆర్ సారాధ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పథంలో దేశానికి దిక్సూచిగా ప్రయాణిస్తున్నామన్నారు. అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్, రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అన్నారు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్క పథకం ఏదో ఒక రూపంలో అందుతుందని తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి ఇంట ఆనందోత్సాహం నింపిన ఘనత సీఎం కేసీఆర్ కే  దక్కిందని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించ విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో 5మండలాల ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, ఆనదికారులు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: