CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

Share it:


  •  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు
  • రూ.70 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేసిన విప్ రేగా కాంతరావు

మన్యం టివి,  మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో శనివారం నాడు రూ.70 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు శంకుస్థాపన చేశారు. మండలం లోని అంబేద్కర్ సెంటర్ నుండి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వరకు సెంట్రల్ లైటింగ్,డివైడర్స్ రూ.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన విప్,రేగా కాంతారావు. అనంతరం మండలంలోని కొమరం భీంనగర్ లో సుమారు రూ.5 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. అలాగే ముత్యాలమ్మ నగర్ లో సుమారు రూ.5 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం మండలం లోని వాసవి నగర్ వద్ద సుమారు రూ.5 లక్షల రూపాయలు అంచనా వ్యయం తో నిర్మాణం చేపట్టనున్న కాంపౌండ్ వాల్,సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గేట్ నుంచి బాలికల హాస్టల్ వెనుక వరకు సుమారు రూ.5 లక్షల అంచనా వ్యయం తో నిర్మించనున్న సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ,పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు,గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల సర్వతో ముఖ అభివృద్ధికి పాటుపడుతుందని, సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలలో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయి అన్నారు.ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన అన్నారు.ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రారంభించుకున్నమని తెలిపారు.పినపాక నియోజకవర్గం రానున్న రోజులలో మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని వారు తెలియజేశారు.మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. కాలనీలలో సమస్యలు స్వయంగా పరిశీలించి,కాలనీ లలో సిసి రోడ్లు,డ్రైనేజ్ నిర్మాణాలు,చేపడుతున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను వారి కులవృత్తుల ద్వార ప్రోత్సహిస్తూ,వారిని అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. మణుగూరు రూపులేఖలు మారనున్నాయి అని,ప్రతి వార్డులోని,అంతర్గత రోడ్లు,పైప్ లైన్,నిర్మాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం హయాంలో దేశం లో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రం లో జరుగుతున్నాయి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు,సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం,ఏకైక నాయకులు సీఎం కేసీఆర్ అని తెలిపారు.ఈ సంధర్బంగా అడిగిన వెంటనే నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్ కు,మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మణుగూరు జడ్పిటిసి పోశం. నరసింహారావు,ఎంపీపీ కారం. విజయ కుమారి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి రామిరెడ్డి,నవీన్,మీడియా ఇంచార్జ్ యాదగిరి గౌడ్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,టిఆర్ఎస్వి నాయకులు,మహిళా కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: