CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎఫ్ టి సి సి ఐ అందిస్తున్న సేవలు ఎగుమతి దారులకు ఎంతో ఉపయోగకరం. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి...

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్  ఇండస్ట్రీ మరియు భారత ప్రభుత్వం కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఎక్స్ పోర్ట్ ఇంపోర్టు మేనేజ్ మెంట్ సర్టిఫికెట్ కోర్స్ (ఎగ్జిమ్) ఎగుమతి దారులకు ఎంతో ఉపయోగకరమని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. శనివారం  వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎగ్జిమ్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఎగ్జిమ్ కోర్సుని పరిశ్రమల సిబ్బంది మార్కెటింగ్ ఆపరేషన్ మేనేజర్లు ఎగుమతి మరియు దిగుమతి దారులు ప్రొఫెషనల్స్ వ్యవస్థాపకులు వ్యాపారంలో రాణిస్తున్న మహిళలు గ్రాడ్యుయేట్లు తయారీదారులు కార్గో ఏజెంట్లు మరియు ప్రైట్  ఫార్వార్డ్స్ పరిశ్రమకు కొత్తగా వచ్చినవారు ఆరు రోజులపాటు ఎగ్జిమ్ కోర్సుని విద్యను అభ్యసించి అంతర్జాతీయ వాణిజ్య పరిచయం విదేశీ వాణిజ్య విధానం  అంతర్జాతీయ మార్కెటింగ్ ఎగుమతి దిగుమతి ఫైనాన్స్ మరియు ఎక్స్చేంజ్ నిబంధనలు అంతర్జాతీయ లాజిస్టిక్స్ కస్టమ్స్ విధానం మరియు అదనపు అంశాలపై శిక్షణ పొందారన్నారు. ఈ సర్టిఫికెట్ కోర్స్ ద్వారా విదేశీ వాణిజ్య సంస్కరణల పై మంచి అవగాహన గ్లోబల్ మార్కెట్లకు ఎక్స్పోజర్ ఎగుమతి సామర్ధ్యాన్ని అర్థం చేసుకోవడం మరియు విశ్లేషించడం మార్కెట్ ఒడిదుడుకులను ఎదురుకోవడానికి ఫైనాన్సింగ్ నైపుణ్యాలు వాణిజ్య సంబంధిత కార్యకలాపాలు ఉత్పత్తుల కోసం కొత్త మార్కెట్లను గుర్తించడంలో మరియు వ్యాపార అవకాశాలను విస్తరించడంలో సహాయపడుతుందన్నారు.ఎగ్జిమ్ కోర్సును తాను విద్యను అభ్యసించి శిక్షణ పొంది ఈరోజు సర్టిఫికెట్ ను అందుకోవడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. ములుగు జిల్లా నుండి ఈ కోర్సుని పూర్తిచేసిన తొలి వ్యక్తిగా తాను ఉండటం సంతోషకరంగా ఉందన్నారు యఫ్ పి ఓ ప్రతినిధులకు స్పైసెస్ బోర్డు సూచనతో ప్రత్యేక రాయితీలు ఎఫ్ టి సీసీఐ కల్పించడం పట్ల సాంబశివరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎఫ్ టి సి సి ఐ డైరెక్టర్ కులకర్ణి మేనేజర్ తేజారెడ్డి కామర్స్ మినిస్ట్రీ అధికారులు ఎక్స్ పోర్టర్ లు కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు బబ్బుల వంశీ ప్రగతి సేవా స్వచ్చంద సంస్థ కోఆర్డినేటర్ జాన్ వ్యాపారవేత్త  జైన  వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు పచ్చిపులుసు నరేష్ కాట్రగడ్డ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: