CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్థాయి సమన్వయ కమిటీలో ఆదివాసి సంఘాలకు భాగ్యస్వామ్యం కల్పించాలి.

Share it:

 


  • స్థాయి సమన్వయ కమిటీలో ఆదివాసి సంఘాలకు భాగ్యస్వామ్యం కల్పించాలి.
  • హక్కుల కల్పన కొరకు స్పష్టమైన  విధివిధానాలు రూపొందిచాలి
  •  ఆదివాసి సేన డిమాండ్


మన్యం మనుగడ, మంగపేట.

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడుభూముల సమస్యల పరిష్కారం కొరకు  జీవో.నెంబర్ 140 తేది.11.09.2022 ద్వారా జిల్లా స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో, పాటు జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు ఇవ్వడం జరిగినది.అట్టి  జీవో లో పేర్కొన్న విధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఆదివాసి సంఘాలకు భాగ్యస్వామ్యం కల్పించాలని ఆదివాసి సేన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మడి సాయిబాబు 

 డిమాండ్ చేశారు.

 ఈ సందర్బంగా మడి సాయిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల కల్పన విషయంలో  నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, కార్యాచరణతో అటవీ హక్కుల చట్టాన్ని మరియు నిబంధనలు విడుదల చేయడం జరిగిందని, వాటిని పాటిస్తూ చట్టం అమలు చేసి ఆదివాసీలకు హక్కులు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన విధివిధానాలు పాటించకపోవడం వల్ల  ఆదివాసీలకు అనేక అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడుతున్నాయని అన్నారు.  అంతేకాకుండా నేడు జీవో నెంబర్ 140 ద్వారా ఏర్పాటు చేయబోయే  జిల్లాస్థాయి సమన్వయ కమిటీ  అనేది  అటవీ హక్కుల చట్ట,నిబంధనలలో పేర్కొన్న జిల్లా స్థాయి కమిటీకి బదులుగా పనిచేస్తుందా.. లేదా జిల్లా స్థాయి కమిటీని సమన్వయం చేయడానికి పనిచేస్తుందా అనే సృష్టత కల్పించాల్సిన అవసరం ఉందని..  ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ  జీవో నెంబర్ 140 కేవలం ఒక కంటితుడుపు చర్యగానే భావిస్తున్నామని  అన్నారు.

ముఖ్యంగా జీవో నెంబర్ 140 అనేది పోడు భూముల పై హక్కుల కల్పన  విషయంలో సరైనటువంటి దిశా నిర్దేశం లేకుండా,అస్పష్టంగా వుంటూ.. ఆదివాసీలకు హక్కుల కల్పన పై చిత్తశుద్ది కరువైందని, అటవీ హక్కుల చట్టం యొక్క స్ఫూర్తి కి విరుద్ధంగా, ఉల్లంఘన చేస్తూ హక్కులనూ హరించేదిగా ఈ జీవో ఉందని వారు పేర్కొన్నారు.

 అటవీ భూములపై సర్వహక్కులు ఆదివాసీలకు ఉన్నాయని,ఆ హక్కుల గుర్తించి, హక్కులు  కల్పించేటటువంటి విషయంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నూ సవరణ చేస్తూ.. స్పష్టమైన విధివిధానాలతో అటవి హక్కుల చట్ట స్ఫూర్తికి లోబడి, ఆదివాసీల భాగస్వామ్యం ఉంటూ,సమస్యలు పరిష్కరించే  విధంగా,రోడ్ మ్యాప్ రూపొందించి జీఓ విడుదల చేయాలని, అందుకొరకు ఆదివాసీ సంఘాలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ములుగు 

జిల్లా కో కన్వీనర్లు చింత రవి ,మంకిడి శ్రీను ,ఏటూరునాగారం మండల అధ్యక్షులు యనక యనక నారాయణ ,మంగపేట మండల అధ్యక్షులు పోలెబోయిన ఆదినారాయణ ,తాడ్వాయి మండల అధ్యక్షులు పీరిల భాస్కర్ ,కన్నాయిగూడెం మండల అధ్యక్షులు కోడె లక్ష్మి నారాయణ ,గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాయం నారాయణ ,తదితరులు పాల్గొన్నారు .

Share it:

TELANGANA

Post A Comment: