మన్యం టీవీ చర్ల చర్ల కు చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు జవ్వాది నరేంద్రబాబు పేదవిద్యార్దినికి సైకిల్ కొనివ్వడం ద్వారా తన ఉదారత చాటుకున్నారు. జవ్వాది కుటుంబ సభ్యుడయిన నరేంద్రబాబు చర్ల మండలం లింగాపురం ప్రాదమికోన్నత పాఠశాలలో ఉపాద్యాయుడిగా విదులు నిర్వహిస్తున్నారు. చర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పొనగంటి మల్లీశ్వరి 8 వ తరగతి వరకు లింగాపురం పాఠశాలలో విద్యనభ్యసించి ఈ విద్యాసంవత్సరం నుండి చర్ల ప్రభుత్వ ఉన్న పాఠశాలలో 9 వ తరగతి చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన మల్లీశ్వరి రోజు నడక ద్వారా చర్ల వచ్చి చదుకుంటోంది. సైకిల్ కొనేందుకు డబ్బులేకపోవడంతో సెలవురోజులలో కూలీ పనులు చేసుకుంటూ డబ్బుపోగుచేసుకుంటోంది. చదుకునే చిట్టితల్లి కూలీపనులకు వెలుతున్న విషయం తెలుకున్న ఉపాద్యాయుడు నరేంద్రబాబు ఇటీవల కొత్తగూడెం ఆర్టీసీ డిపోమేనేజర్ గా విదులు నిర్వహించిన తన సోదరుడు జవ్వాది వెంకటేశ్వరబాబు పదవీ విరమణ పొందిన సందర్బంగా పదవీ విరమణ జ్ఞాపకార్దం మల్లీశ్వరికి రూ. 5000 లతో సైకిల్ ను కొనుగోలు చేసి అందచేసారు.
Post A Comment: