మన్యం టివీ దుమ్ముగూడెం::
విజయవాడలోజరిగే 24వ సిపిఐ జాతీయ మహాసభను జయప్రదం చేయండి కోరుతూ మండల కార్యదర్శి రావులపల్లి రవికుమార్ గోడపత్రాలను విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మండలం నుండి వచ్చే నెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే మహాసభకు ప్రజలు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెల్లి మహాసభను విజయవంతం చేయాలని కోరారు 47 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ జాతీయ మహాసభకు ప్రపంచవ ్యాప్తంగా 21 దేశాల నుండి ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు బిజెపి అరాచక పాలన సాగనంపడమే ముఖ్య ఉద్దేశంగా సాగుతున్నది సమావేశంలో బిజెపి అధికారంలోకి వచ్చి పేద ప్రజలను అభివృద్ధిని తుంగలో తొక్కుతూ దేశ సంపద మొత్తం సంపన్న వర్గాలకు దోచిపెడుతుందని అన్నారు వేదిక ప్రజలంతా ఏకమే బిజెపి పార్టీని ఓడించే శక్తులను ఐక్యం చేయడానికి ఈ మహాసభ వేదిక కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఎంపీటీసీ కుంజ కనకరత్నం నాయకులు నోముల రామిరెడ్డి కిమిలి ఎల్లారెడ్డి తాటిపూడి రమేష్ గౌడయ్య బుల్లోజు వేణు శంకర్ లింగయ్య మట్ట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: