CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దమ్మపేట గిరిజన గురుకులం పాఠశాలలో 1992 పూర్వ ఎస్ఎస్సీ విద్యార్ధులు వితరణ

Share it:


మన్యం మనుగడ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం దమ్మపేట లో గల స్థానిక గిరిజన గురుకులం లో 1992 బ్యాచ్ లో  పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ప్రస్తుత గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ను ఈ రోజు  సందర్శించి తమ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత విద్యార్థులకు అవసరమైన సుమారు 60 వేల రూపాయల విద్యుత్ ఉపకరణాలను అందించి తమ పూర్వ పాఠశాలపై ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ శ్యామ్ కుమార్ వారిని సాదరంగా ఆహ్వానించి గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చారు. ఇందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్దులు రాంబాబు, పెద్ద వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరావు, లక్ష్మణ రావు, వెంకటనారాయణ, రాజారావు, రమేష్, మాధవరెడ్డి, సుబ్బయ్య, శ్రీరామమూర్తి, శివలింగ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: