CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారత దేశ స్వేచ్చా స్వాతంత్ర్యo కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలి--:శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ బాడిశ రమేష్

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలంలోని రాజుపేట గ్రామంలో 75వ వజ్రోత్సవ స్వతంత్ర దినోత్సవ వేడుకను శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు బాడిశ రమేష్ చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బాడిశ నాగ రమేష్,పెద్దలు వత్సవాయి శ్రీధర్ వర్మ,తుమ్మల ముఖర్జీ, బండ్ల చిన బాబు,రాజారత్నం, ఎఱ్ఱ శ్రీధర్, పోలిన హరి బాబు లు మాట్లాడుతూ శతబ్దాల తరబడి మన స్వేచ్చకోసం, మన స్వతంత్రo కోసం, మన అస్తిత్వం కోసం, తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన ప్రతి ఒక్కరిని మనం స్మరించుకువాలి, ఎల్లప్పుడూ వారిని పూజించాలి. 75 సంవత్సరాలనుండి స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నప్పటికి ఇప్పటికి మన దేశంలోఉన్న సమస్యలకు పరిష్కారం లభించ లేదు దానికి గల కారణం ప్రతి ఒక్కరిలో స్వార్థం పేరుకపోయింది, సంకుచిత మనస్తత్వం నెలకొంది. ఈ దేశం నాది,ఈ దేశంలో ఉన్న సమస్త భారతీయులు నా తోబుట్టువులు అనే విశాలమైన దృక్పధం, మమకారం కొరవడింది, అందువలన దేశంలో ఇప్పటికి దేశం లో ఆకలి ఆకలి గానే ఉంది, అవిద్య అవిద్య గానే ఉంది, అశాంతి తో, అనారోగ్యం తో దేశం కునారిల్లుతుంది. మన దేశంలో చదువు లేక కాదు, సౌభాగ్యం లేక కాదు, సంపద లేక కాదు, సామజిక చైతన్యం, సామజిక వికాసం, సంవేదనా శీలత లేక మన దేశం వెనుకబడి పోతుంది, ఈ దేశం లో వేల సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్రం, గణితం, వైద్య శాస్త్రం వెల్లివిరిసింది. ప్రపంచానికి వైద్యం తెలియక ముందే మన దేశం లో సుశృతుడు నేత్ర చికిత్సలు చేశాడు.ఇటువంటి ఎందరో మహానుభావులు మనదేశం లో జన్మించారు.ఒక భగత్ సింగ్, ఒక నేతాజీ, ఒక అశ్వాకుల్లాఖాన్, ఒక మదన్ లాల్ దింగ్ర, లాల లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్, ఉయ్యాలవాడ వీర నరసింహరెడ్డి, కుదిరామ్ బోస్, రాజగురు, సుఖదేవ్, చంద్రశేఖర్, మహాత్మా గాంధీ లాంటి ఎందరో, మరెందరో త్యాగ ధనుల త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రo.శతాబ్దాల తరబడి బానిస సంకెళ్లు నుండి భారతావని ని విడిపించేందుకు మూడుకోట్ల 15 లక్షల మంది తలలు వాల్చితే కానీ ఈ మువ్వన్నెల జెండా పైకి ఎగురలేదు.త్రివర్ణ పతాకం లో ఉన్న కాషాయం రంగు సమర యోధుల త్యాగానికి ప్రతీక, తెలుపు రంగు శాంతికి ప్రతీక, ఆకు పచ్చరంగు పాడి పంటలకు, అభివృద్ధి కి ప్రతీకలు అటువంటి స్వేచ్ఛ భారతానికి రాజ్యాంగం రాసి దశ దిశ నిర్దేశం చేసిన మహనీయుడు దాదా సాహెబ్ అంబేద్కర్ అటువంటి మహనీయులను స్వాంతంత్ర్య దినోత్సవం నాడే కాకుండా ఎల్లప్పుడూ స్మరణ చేసుకోవాలి, వారి వారి ఆశయాలను మనం సాధించాలి అంటూ తెలియజేశారు. తదనంతరం, దాదాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి పుష్పాలతో నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ సభ్యులు బాడిశ రమేష్, రాజుపేట గ్రామస్తులు తుమ్మల బెనర్జీ, పోలిన హరిబాబు, ఎర్ర శ్రీధర్ బాబు, బండ్ల చినబాబు,ఉండవల్లి రమేష్, జీవవైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు, ఈసం సమ్మక్క ,కుర్సం పుల్లయ్య, జయరాజు, స్నేహ కుమార్, మైపా శ్రీను మరియు వివిధ పార్టీ నాయకులు కొమరం ధనలక్ష్మి, వత్సవాయి శ్రీధర్ వర్మ, గుంటపుడి తిరుమల,నిమ్మగడ్డ ప్రవీణ్, ఓదెల కిషోర్ , ఇస్సార్ ఖాన్ మరియు శ్రీరామ కృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు బాడిష నవీన్, కొమరం నితిన్, కొమరం వికాస్, ముయబోయన శివ, మడకం రమేష్, బాడిష ఆది, ఇందారపు రమేష్, చెట్టుపల్లి రామకృష్ణ, చౌలం వేణు, ఈసం రామనాథం, గట్టుపల్లి చంటి, చౌలం బాబు తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: