CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం...

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : ఆదివాసి అభివృద్ధి కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని ఎస్ఐ విజయలక్ష్మి సూచించారు. మంగళవారం ఆదివాసి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసి జెండాను సీనియర్ నాయకులు బేతి సోమయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ.... ఆదివాసి యువత ఉద్యోగ, ఉపాధి మార్గాల వైపు దిష్టి సారించాలన్నారు. అక్షరాస్యత వైపు ఆదివాసి గ్రామాలు అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోణకండ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ ధారా బాబు, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు, మున్నూరుకాపు సంఘం మండల అధ్యక్షులు లంకా నరసింహారావు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా మాజీ అధ్యక్షులు కేశబోయిన నరసింహారావు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు చిన్న పిచ్చయ్య ఉపాధ్యాయ సంఘం నేత వీరన్న, ఆదివాసి మండల నాయకులు బొర్ర సురేష్,మల్లం కృష్ణయ్య, కాకా మహేష్,కుంజా వెంకటేష్, కారం నాగేంద్రబాబు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: