CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బానోత్ పార్వతి, పోలీస్ స్టేషన్ లో ఎస్సై విజయలక్ష్మి, రెవిన్యూ కార్యాలయంలో తహసిల్దార్ వర్స రవికుమార్, రైతు వేదికలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తెలంగాణ దిమ్మె వద్ద టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు పసుమర్తి శేషగిరిరావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, వైసిపి నరకుళ్ల సత్యనారాయణ, ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి, జిల్లా నాయకులు మాలోత్ భోజ్య నాయక్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు భూపతి శ్రీను, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్,మేడా మోహన్ రావు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, చీదెళ్ల పవన్ కుమార్, సంకా కృపాకర్, టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు ఉప్పతల గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: