మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు జెండాకు వందనం చేశారు. మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ , తహసిల్దార్ విక్రమ్ కుమార్ , స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ రాజగోపాల్, అటవీ క్షేత్ర అధికారి తేజస్వి తమ తమ కార్యాలయాలలో జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యాలయాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించి జెండా వందన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలలో ఆయా శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: