మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని ములకపాడు గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో తల్లిపాలు పిల్లలకు ఎంతో మేలని పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు పట్టించాలని ముర్రుపాలు బిడ్డకు ఆరోగ్యవంతంగా ఉండటానికి దోహదపడుతుందని సిపిడిఓ నవ్య శ్రీ తెలిపారు తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు ప్రాతమే పట్టించాలని తల్లిపాలు పట్టించడం వలన బిడ్డ ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారని తెలియజేశారు. అలానే ప్రతి గర్భిణీ స్త్రీ గవర్నమెంట్ హాస్పిటల్ లోనే పరీక్షలు చేయించి ప్రసవాలు చేపించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గర్భిణీలు బాలింతలు పిల్లలు గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: