CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వజ్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి -అధికారులు ప్రజాప్రతినిధుల పిలుపు -మండల పరిషత్ కార్యాలయంలో సన్నాహక సమావేశం.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు వజ్రోత్సవ వేడుకలను అశ్వారావుపేటలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు ప్రజాప్రతినిధులు మండల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీడీవో విద్యాధరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, తహసిల్దార్ చల్ల ప్రసాద్, సీఐ బొమ్మెర బాలకృష్ణ, ఎస్సై చల్లా అరుణ తదితరులు ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అశ్వారావుపేటలో అందరి సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని, దీనికి అశ్వారావుపేటలో ఉన్నటువంటి వ్యాపారులు, యువకులు, పాఠశాల యాజమాన్యాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, అందరూ సహకరించి ఈనెల 8 నుండి 22 వరకు జరగబోవు కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటికే కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తియుతమైన సినిమాలను థియేటర్లో విద్యార్థులకు చూపించడం జరుగుతుందని, ఇంటింటికి జాతీయ పథకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని, అదేవిధంగా గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడమ్ రన్ నిర్వహణ, మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు,రక్తదాన శిబిరాల నిర్వహణ, ముగ్గుల పోటీలు ఇలా అనేక రకాల కార్యక్రమాలకు మండల ప్రజలందరూ భాగస్వామ్యం అయి దేశభక్తిని చాటాలన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిబంధనలు పాటిస్తూ వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని, జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. జాతీయ ఉద్యమ కాలంలో ఎందరో త్యాగధనుల ఉద్యమ స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. అదే స్ఫూర్తితో వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, తహసిల్దార్ చల్ల ప్రసాద్, ఎంపీడీవో విద్యాధరరావు, సిఐ బొమ్మెర బాలకృష్ణ, ఎస్ఐ చల్లా అరుణ, ఎంపీఓ సీతారామరాజు, ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహమాన్, వర్తక సంఘం అధ్యక్షులు మహేశ్వరరావు, అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, లైన్స్ క్లబ్ అధ్యక్షులు కంచర్ల భాస్కరరావు, సీమకుర్తి సుబ్బారావు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: