జూలూరుపాడు ఆగస్టు 15, (మన్యం మనుగడ ప్రతినిధి) 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మండల వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రైవేట్ విద్య సంస్థల యాజమాన్యాలు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారత్ మాత, మహాత్మా గాంధీ, అంబేద్కర్, సావిత్రిబా పూలే, అల్లూరి సీతారామరాజు వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. "బోలో స్వతంత్ర భారత్ కి జై", "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" అంటూ నినదించి తమ దేశభక్తిని చాటుకున్నారు. మండల వ్యాప్తంగా పల్లెలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జాతీయ గీతాలాపనతో పులకించిపోయాయి.
Post A Comment: