CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మైనార్టీ రిజర్వేషన్లలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం.విద్య ఉద్యోగ ఉపాధిలో వెనుక బాటు.బీజేపీ పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా..

Share it:


మన్యం మనుగడ, మంగపేట.


తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న తెరాస కాంగ్రెస్ మజ్లీస్ పార్టీలు తన వాగ్దానాన్ని ఇప్పటి వరకు నెర వేర్చాలేదని బీజేపీ పార్టీ ములుగు జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మహ మ్మద్ యాకుబ్ పాషా అన్నారు. మంగపేట మండలం రాజుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడుతూ 2018 నవంబర్ 29న అసెంబ్లీ ఆమోదించిన సామాజికంగా విద్యా పరంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) చట్టం 2018 గా పేర్కొ నే మహారాష్ట్ర చట్టం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించిందని మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫారసు మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 12 శాతం విద్యా సంస్థ ల్లో 13 శాతం రిజర్వేషన్లు మించ రాదని కోర్టు తీర్పునిచ్చింది. మరా ఠాలకు 16 శాతం రిజర్వేషన్లతో మహారాష్ట్రలో మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరుకున్నాయని కోర్టు తీర్పు తరువాత మొత్తం కోటా ఇప్పుడు ఉద్యోగాలకు 62 శాతం విద్యలో 63 శాతంగా ఉందని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ 12% ముస్లిం కోటా అమలు చేయాలని తెరాస కాంగ్రెస్ మజ్లీస్ పార్టీలని డిమాండ్ చేస్తున్నట్లు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకు చేసింది ఏమి లేదని విద్య ఉద్యోగలలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయిందని వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్న జీవోలను 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయకుండా తెరాస కాంగ్రెస్ మజ్లీస్ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మైనార్టీల వెనుక బాటు తాననికి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని మండి పడ్డారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణంలోకి తీసుకుని సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితికి మించి రాష్ట్రంలోని మొత్తం రిజర్వేషన్ కోటాను తీసుకున్నారని తెలంగాణ రాష్ట్రంలోను 12% ముస్లిం కోటా కోసం ఒత్తిడి చేసి అమలు జరిగే విదంగా పార్టీలు మైనార్టీ నాయకులు కృషి చేయాలని మైనార్టీలకు విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలకో పాటు పడాలని రిజర్వేషన్ల పెంపు దలకు కృషి చేయాలని ములుగు జిల్లా బీజేపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ యాకుబ్ పాషా డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: