CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రీడా మైదానం ఏర్పాటు దేనికి?? ఆరు నెలలుగా ఖాళీగా ఉంటున్న ప్రాంగణం..

Share it:

 


  • ట్రాక్టర్ తో క్రీడా ప్రాంగణం దున్నేయడంతో డాక్టర్ పై అసహనం వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు మండల యువత..
  • ఉన్నత అధికారులతో ప్రారంభించిన మైదానాన్ని తన సొంత స్థలం లాగా భావిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని యువకుల వాదన..



మన్యంటీవీ దుమ్ముగూడెం

 

దుమ్ముగూడెం మండలంలోని ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నటువంటి క్రీడా మైదానం ఇప్పుడు దున్నేయడం తో అనేక అనుమానాలకు దారితీస్తుంది తన సొంత స్థలం లాగా మండల అధికారులకు తెలియజేయకుండా దున్నించిన ఒక ప్రభుత్వ డాక్టర్ వైఖరి ఏంటో అర్థం కావడం లేదు. పాతకాలం నాటి ప్రభుత్వ వైద్యశాల స్థలాన్ని భారీ వృక్షాలు శిధిలవస్థల భవనాలు ఈ ప్రభుత్వ భూమిని గమనించిన సిఐ వెంకటేశ్వర్లు ఏజెన్సీలోని మండల ఆదివాసి క్రీడాకారుల కోసం క్రీడ మైదానాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించి మండల అధికారులు సమన్వయం చేసి ఐటీడీఏ అధికారులకు సమాచారం ఇచ్చి పనులను ప్రారంభించి క్రీడా మైదానం గా తీర్చిదిద్దారు ఈ మైదానం ఏర్పాటు కోసం గ్రామపంచాయతీ సర్పంచులకు తెలియజేసి వారి నుంచి కొంత నిధులు హాస్పిటల్ నిధులు మండలంలోని కాంట్రాక్టర్స్ ఫైనాన్సర్స్ సహాయం తీసుకుని పోలీస్ వారు ప్రతిష్టాత్మంగా తీసుకొని తయారుచేసిన క్రీడ మైదానాన్ని ఐటిడిఎ పిఓ గౌతమ్ అప్పటి ఏఎస్పీ ఇప్పటి జిల్లా ఎస్పీ వినీత్ ఇరువురు కలిసి ప్రారంభించారు సభ ముఖంగా పిఓ మాట్లాడుతూ మండలంలోని ఏజెన్సీ గ్రామాల క్రీడాకారులు ఈ మైదానాన్ని సద్వినియోగం చేసి ఉన్న స్థాయికి ఎదగాలని తెలిపారు ఈ మైదానంలో వాలీబాల్ వనవాసి కళ్యాణ పరిషత్ క్రీడా పోటీలు స్కూల్ గేమ్స్ ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ స్పోర్ట్స్ సెలెక్షన్ పోటీలు అన్నీ కూడా ఈ మైదానంలోని నిర్వహించారు. 


*బదిలీ కావడంతో మొదలైన రచ్చ*

గతంలో పనిచేసిన సీఐ ఇక్కడ నుంచి కొత్తగూడెం ఎస్పీ ఆఫీసుకు బదిలీ కావడంతో ఇదే అధునిక చూసిన వైద్యశాల అధికారులు క్రీడామైదానికి ఎవరు కూడా రావడం వీల్లేదని వాకింగ్ జాగింగ్ సెటిల్ ఆడే క్రీడాకారులకు తెలియజేశారు ఇది తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమి ఎవరు కూడా రాడానికి వీల్లేదని అన్నారు దీన్ని మండలంలోని అధికారులు దృష్టికి రాజకీయ నాయకులు యువకులు క్రీడాకారులు తీసుకెళ్లగా అందరూ కూడా డాక్టర్ కి వత్తాసు పలికి మేమేం చేయలేము అని తప్పించుకున్నారు ఈ విషయాన్ని ఐటిడి పి ఓ గారికి వినతిపత్రం అందచేశారు. అలానే 15 రోజుల క్రితం ఎస్పీ కలెక్టర్ మైదాన ప్రాంతాన్ని పరిశీలించి 2 కోట్లతో నిర్మించే భారీ స్థాయి క్రీడా మైదానం ఏర్పాటుకు అనువైన ప్రదేశం అని నిర్ణయించి ప్రతిపాదన పంపారు గమనించిన వైద్య అధికారి ఈ స్థలాన్ని పోలీసు వారు స్వాధీనం చేసుకుంటారని ఉద్దేశంతో ఈనెల 14వ తారీఖున సాయంత్రం పూట ఒక ట్రాక్టర్ సహాయంతో గ్రౌండ్ మొత్తం దున్ని వేయడం చేశారు ఎంతో కష్టపడి 10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రౌండ్ ని దుండివేయడంతో క్రీడాకారులు మండలంలోని యువత ఆగ్రహం వ్యక్తం చేసి భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు ఈ విషయం ఐటిడిఏ పిఓ దృష్టికి వెళ్లడంతో స్పోర్ట్స్ అధికారి వీరు నాయక్ ఏ టి డబ్ల్యూ నరసింహారావు ఇరువురిని పంపించి నివేదిక తయారు చేసుకొని రమ్మని చెప్పారు అనంతరం ఎమ్మార్వో చంద్రశేఖర్ పై కలెక్టర్ క్రీడామైదానం దున్ని వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు యువకులకు స్పోర్ట్స్ అధికారి హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు. 

*మండలంలోని యువత తాను ఒక డాక్టర్ కాదని కాంట్రాక్టర్ల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు*

ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్యం చేయాలని ఆలోచన కంటే హాస్పిటల్ అభివృద్ధి పనుల్లో జరిగే కాంట్రాక్టర్ పనుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని అలానే గ్రౌండ్ గురించి ఇంత రచ్చ జరగడానికి గల కారణం తను ఒక సబ్ సెంటర్ నిర్మాణం క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తుంటే క్రీడాకారుల అభ్యంతరం తెలిపి ఐటీడీఏ పీవో కు సమాచారం ఇవ్వడంతో ఆ పనులు నిలిచిపోయాయని ఆ కక్షతో ఇంత రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు ఆస్పటల్ పరిధిలో ఎలాంటి పనులు చేయాలన్న సిసి రోడ్డు నిర్మాణం ప్రహరీ గోడ నిర్మాణాలు పెయింటింగ్స్ అలానే హాస్పిటల్ పరిధిలో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణ నికి ఆశా వర్కర్లతో వాటరింగ్ చేపించడం అనేక అక్రమాల్లో తన పాత్ర ఉందని మండల అధికారుల అండదండ రాజకీయ నాయకులతో పొత్తులు తనకు వ్యతిరేకంగా ఉన్న పత్రిక మిత్రుల్ని మచ్చిక చేసుకోవడం ఆయనకు అలవాటు, గతంలో కూడా ఆదివాసి పిల్లలకు ఫిజికల్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో కూడా పెద్ద రాద్ధాంతం చేశారు ఆదివాసి నాయకులు మల్లు దొర, సిపిఐ ఎంఎల్ ప్రజాతంత్ర నాయకులు సాయన్న కూడా కొన్ని సందర్భాల్లో ఆదివాసులపై చులకన చూస్తున్న డాక్టర్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో క్రీడా మైదానం ఏర్పాటుకు ఆమోదం తెలిపి గ్రామపంచాయతీ సర్పంచులు మండలంలోని ఒక పెద్ద రాజకీయ నాయకుడు సూచనల మేరకు తమకు గ్రౌండ్ అవసరం లేదని వినతి పత్రాల మీద 9 మంది సర్పంచులతో సంతకాలు సేకరించి మరి అధికారులకు పంపించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది

ఈ సందర్భంగా మండలంలోని క్రీడాకారుల యువత మాట్లాడుతూ రేపు మాపో వెళ్ళిపోయి అధికారి కోసం శాశ్వతంగా మండలంలో ఉండే యువతను నాయకులు అధికారి కోసం సపోర్ట్ చేయడం తమకు చాలా బాధాకరంగా ఉందని,అలానే క్రీడా మైదానంలోకి ప్రవేశం లేకుండా చేస్తూ తన సొంత స్థలం లాగా భావిస్తు ట్రాక్టర్ తో దున్నించిన డాక్టర్ పై ఏజెన్సీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో జిల్లా కలెక్టర్కు వినిపించుకున్నారు అలానే ఖాళీగా ఉన్న క్రీడా మైదానాన్ని తర్వాత సంవత్సరాల భవిష్యత్తు కొరకు హాస్పటల్ నిర్మించే వరకు క్రీడల కొరకు తమ ఉపయోగిస్తామని క్రీడాకారులు యువత తెలిపారు. అలానే స్థానిక సర్పంచ్ పీసా కమిటీ సభ్యులను వివరణ అడగగా తమకు ఎటువంటి సమాచారం లేదని మేము క్రీడల కోసం ఆనాడే తీర్మానం చేసి స్థలాన్ని ఇవ్వడం జరిగిందని సభ్యులు తెలిపారు..

Share it:

TS

Post A Comment: