CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిరోధక సమ్మెను కొనసాగిస్తున్న డైలీవేజి కార్మికులు..వంట పనులు చేస్తూ పరిసరాలను శుభ్రపరుచుకుంటున్న విద్యార్థులు.

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న  కార్మికులు మూడో రోజుకు చేరుకుంది 9 నెలలుగా జీతం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సమ్మెను కొనసాగిస్తామని పాఠశాలల్లో పనిచేసే వర్కర్స్ తెలియజేశారు ఈ సందర్భంగా మండలంలోని 8 పాఠశాలలో పనిచేస్తున్న సుమారు 50 మంది డైలీ కూలీలు సమ్మె  కొనసాగిస్తుండడంతో గత మూడు రోజులుగా విద్యార్థినిలు విద్యార్థులు వంటలు చేయడం పరిసరాలను శుభ్రపరచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా లక్ష్మీ నగరం ఆశ్రమ పాఠశాలలో సుమారు 1000 మంది పిల్లలు ఉండడంతో డైలీ వేజ్ వర్కర్స్ సమ్మెలో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. అలానే గౌరవరం, మంగువాయి బడవ, లక్ష్మి నగరం ఆశ్రమ పాఠశాలలో సమ్మె చేస్తున్న కార్మికులకు ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ నాయకులు సుందిమలు దొర మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు  రవి కార్మికులు బాపనమ్మ వీరస్వామి నాగమణి సత్యనారాయణ వెంకటేశ్వరరావు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: