CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీలో రాజ్యాధికారం ఆదివాసీలకే

Share it:

 


  • ఏజెన్సీలో రాజ్యాధికారం ఆదివాసీలకే.                                            
  • మద్దతు ప్రకటించిన ఆదివాసీ సేన
  • క్విట్ ఏజెన్సీ ఉద్యమాన్ని ఉదృతం చేయాలి- ఊకె రవి
  • బీఎస్పీ మద్దతు  దుమ్మగూడెం మండల కన్వీనర్-- సరియం భీమ్
  • మద్దతు ఇచ్చిన బర్లగూడెం ఎంపీటీసీ-కురసం సమ్మక్క

మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 30 :             

ఉద్యమకారులు అయిన నర్సింహమూర్తి, నాగరాజు, భార్గవ్ లకు  ఎంపీటీసీ సమ్మక్క పూలమాలలు వేసి 8 వ రోజు దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఏ.ఎన్.ఎస్.చేస్తున్న ఉన్న ఉద్యమం సరి అయినది అన్నారు.

 వలస గిరిజనేతరులు ఏజెన్సీ వదిలి వెళ్లిపోవాలని  ఆదివాసీ నవనిర్మాణ సేన చేపట్టిన రిలే నిరాహారదీక్షకు ఆదివాసీ సేన మంగళవారం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ సేన  కన్వీనర్ ఊకె రవి మాట్లాడుతూ ఆదివాసీ నవనిర్మాణ సేన తీసుకున్న క్విట్ ఏజెన్సీ డిమాండ్ ఆదివాసీ అస్థిత్వాన్ని నిలబెట్టే డిమాండ్ అన్నారు. 1950 లో రాజ్యాంగం ఏజెన్సీ డిక్లరేషన్ ఆదివాసీలకు మాత్రమే చేసిందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వస్తున్న గిరిజనేతరులను ఏజెన్సీ నుండి తరిమి కొట్టే విధంగా అన్ని ఆదివాసీ సంఘాలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీ నవనిర్మాణ సేన చేపడుతున్న ఉద్యమానికి ఈ ప్రాంత ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ బానిసత్వాన్ని విడనాడాలని అన్నారు. 5 వ షెడ్యూల్ ప్రాంతాన్ని రక్షించడమే ఆదివాసీల ప్రధాన బాధ్యత అన్నారు. బీఎస్పీ దుమ్మగూడెం మండల కన్వీనర్ సరియం భీమ్ దీక్షకి మద్దతు ఇచ్చారు. ఈ ఉద్యమానికి బీఎస్పీ చివరి వరకు నిలుస్తుందని హామీ ఇచ్చారు.


వెంకటాపురం వాజేడు మండలాల అంగన్వాడీ టీచర్ల మద్దతు

 వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన ఆదివాసీ అంగన్వాడీ టీచర్లు ఏ.ఎన్.ఎస్.చేస్తున్న దీక్షా శిబిరానికి  వచ్చి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.  అనంతరం సాంప్రదాయ ఆదివాసీ పాటలకు నృత్యం చేశారు.ఆదివాసీ సేన జిల్లా కో కన్వీనర్ కారం రమేష్, ఆదివాసీ సేన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్శా నరేష్,  ఒంటిమామిడి, మహితాపురం, చిరుతపల్లి గ్రామాల ఆదివాసీలు దీక్షలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: