CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పుట్టిన బిడ్డకు ముర్రుపాలే అమృత బిందువులు.శిశువు నిండు నూరేళ్ళ ఆరోగ్యం తల్లిపాలపైనే ఆధారపడి ఉంది.

Share it:



  • ఐ సి డి ఎస్ ఏటూరునాగారం ప్రాజెక్ట్ సి డి పి ఓ శ్రీమతి హేమలత.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

మండల కేంద్రం లో గురువారం ఐ సి డి ఎస్ ఏటూరునాగారం ప్రాజెక్ట్ పరిధిలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సిడిపిఓ హేమలత తన బృందం తో ఏటూరునాగారం సి.హెచ్.సి ఆస్పత్రిలో తల్లిపాల ప్రాముఖ్యత పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా డెలివరీ వార్డులో ఉన్న బాలింతలని కలిశారు. ప్రసవం అయిన వెంటనే తమ శిశువుకి ముర్రు పాలు తాగించారా అని బాలింతలని వివరాలు కనుక్కున్నారు. అనంతరం బాలింతలతో మాట్లాడుతూ ప్రసవం అయిన గంట లోపే తల్లికి వచ్చే ముర్రు పాలు బిడ్డకి పట్టించాలని, బిడ్డ నిండు నూరేళ్ళ ఆరోగ్య ఆ ముర్రు పాలలోనే దాగి వుందని అన్నారు. కనీసం 6 నెలలు నిండే వరకు క్రమం తప్పకుండా బిడ్డకి తల్లి పాలు తప్పనిసరిగా తాగించాలని అప్పుడే ఆ శిశువులో తనకు భవిష్యత్తులో రాబోయే ఎన్నో రకాల వ్యాధులను తట్టుకునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల వారోత్సవాలకి సంబంధించిన కరపత్రాలను బాలింతలకు పంపిణీ చేశారు.

అనంతరం నేతాజీనగర్ లో పర్యటించి అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న బాలింతలు, గర్భిణీ స్త్రీలతో ముచ్చటించారు.గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవం అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అదేవిధం గా ప్రసవం జరిగిన వెంటనే అప్పుడే పుట్టిన నవజాత శిశువుకి తప్పక తల్లిపాలు తాగించడం ద్వారా బిడ్డకి ఎన్నో రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పించే ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినట్టే అని గర్భిణీస్త్రీలు మరియు బాలింతలకి వివరించారు.  

అదేవిధంగా చల్పాక సెక్టార్ లోని గుండంగివాయి గుత్తికోయ గూడెంలో ఆ సెక్టార్ సూపర్వైజర్ చంద్రకళ ఆధ్వర్యం లో కూడా తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భoగా సూపర్వైజర్ తల్లిపాల ప్రాముఖ్యతను స్థానిక గర్భిణీస్త్రీలు మరియు బాలింతలకు వివరించారు.

ఈ కార్యక్రమం లో అకులవారి ఘనపూర్ సెక్టార్ సూపర్వైజర్ విజయకుమారి,స్థానిక అంగన్వాడీ ఈచర్లు వసంత, భవాని,లలిత, రజిని,లలిత కుమారి,చల్పక సెక్టార్ పరిధిలోన అంగన్వాడీ టీచర్లు గంగమ్మ, ఊర్మిల,అరుణ, జయలక్ష్మి,రజిత కమలాపురం ఆశావర్కర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: