CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభివృద్ధికై నడుంబిగించిన అశ్వారావుపేట ప్రజలు.సౌకర్యాల కల్పనకై మరో ఉద్యమానికి నాంది.

Share it:

 


  •  ప్రణాళిక సిద్ధం చేస్తున్న నాయకులు


మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేటలో మరో ఉద్యమం రాజుకుంటుంది. జిల్లాలు విడిపోయిన తర్వాత జిల్లా కేంద్రం దూరం అవడంతో సౌకర్యాలు అన్ని అందుబాటులో లేవంటూ, గతంలో ప్రతిదానికి సత్తుపల్లి సెంటర్ గా ఉండేదని, జిల్లాల విభజన తర్వాత కోర్టు, ఆర్టీవో ఆఫీస్ జిల్లా కేంద్రంలో ఉండడంతో ప్రయాణానికి సరిపడా బస్సుల, కానీ సౌకర్యాలు కానీ లేకపోవడంతో అనేక ఆందోళనలు నిర్వహించినప్పటికీ ఫలితం లేదంటూ అశ్వారావుపేట ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ సెంట్రల్ లైటింగ్ కానీ, సరైన డ్రైనేజీ వ్యవస్థ కాని, మెజిస్టేరియల్ కోర్టు కానీ, వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆర్టీవో ఆఫీస్ కానీ, సబ్ రిజిస్టార్ ఆఫీస్ కానీ లేవని, ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు విన్నవించినప్పటికీ ఫలితం లేదని, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ పనులు మాత్రం జరగటం లేదని, అభివృద్ధి ఎక్కడికి అక్కడే కుంటుబడి ఉందని అసహనం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు నాయకులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాజకీయ పక్ష నాయకులు స్థానిక యువత, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు పాత మండల పరిషత్ కార్యాలయం వద్ద సమావేశమై, అశ్వారావుపేట అభివృద్ధికి సహకరించని ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయాలని, లేకుంటే అశ్వారావుపేట అభివృద్ధికి సహకరించాలని, కనీస సౌకర్యాల కల్పనకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కోర్టు దమ్మపేటలో ఏర్పాటు చేయాలని స్థల పరిశీలన కూడా చేయడంతో అశ్వారావుపేటపై వివక్షత చూపిస్తున్నారని ఆందోళన చెందుతున్న ప్రజలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కల్పించుకొని అశ్వారావుపేటకు కనీస సౌకర్యాలు రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పక్ష నాయకులు, స్వచ్చంద సేవా సంస్థ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక వ్యాపార వర్గాలు, వివిధ పాత్రికేయులు, ప్రజలు సమావేశమై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీంతో స్థానిక అధికార పార్టీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి కలుగజేసుకొని ఫోనులో ఇక్కడ జరుగుతున్న ఆందోళనను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు వివరించారు. త్వరలోనే అశ్వారావుపేటకు వచ్చి అన్ని వర్గాల ప్రజల తోటి ఈ విషయాలపై మాట్లాడుతానని అప్పటివరకు ఓపిక పట్టాలని ఎమ్మెల్యే మెచ్ఛా చెప్పినట్లు ఎంపీపీ తెలిపారు. దీంతో ఆందోళనను ఈనెల 23వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు కలుగజేసుకోకపోతే భవిష్యత్తులో మరో ఉద్యమానికి నాంది పలుకుతామని స్థానిక ప్రజలు నాయకులు హెచ్చరిస్తున్నారు.

Share it:

TS

Post A Comment: