CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో జలగం నగరం కి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త బూర నాగేశ్వరరావునీ కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొగుళ్ళకు చెన్నకేశవరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ యువ నాయకురాలు వగ్గెల పూజ, ఎంపీటీసీ సత్యవరపు తిరుమల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ధైర్యం చెప్పి తాము ఉన్నామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చిన్న చెట్టి రామకృష్ణ, బండారు మహేష్, తగరం రాజేష్, జల్లిపల్లి దేవరాజు, బంగారు రాజు, మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: