CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం : 

ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూల్లల్లో హాస్టళ్ళల్లో కళాశాలలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం ములుగు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ గణేష్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తోకల రవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలలో కనీస మౌలిక సదుపాయాలు మంచినీరు,మరుగు దొడ్లు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు.పోచాపూర్ గ్రామ విద్యార్థులకు పాఠశాలకు వెళ్లడానికి రోడ్డు బ్రిడ్జి సౌకర్యం కల్పించాలన్నారు.ఏటూరు నాగారం,కొండాయి హాస్టల్లో కరెంట్ సౌకర్యం కల్పించాలని అన్నారు. నూగూరు వెంకటాపురంలో నూతన జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్,మెస్ చార్జీలు పెంచాలన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్సీఎస్ఎంఎచ్ హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు.ఏటూరు నాగారంలో ఎస్సీ,బీసీ,ఎస్ఎంఎచ్ హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు.లక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు.అదేవిధంగా బండారు పల్లి మోడల్ స్కూల్లో హాస్టల్ తెరవాలని అన్నారు.హాస్టల్లలో పరిశుభ్రత పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరారు.గిరిజన యూనివర్సిటీ ఏర్పాట్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లానాయకులు గుగులోతు రమేష్,సాధు రాకేష్,జోడు సాయి చరణ్,మోరే లక్ష్మణ్, పూణే పవన్ విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: