CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

Share it:

 




జూలూరుపాడు ఆగస్టు 15, (మన్యం మనుగడ ప్రతినిధి) 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు అంబేద్కర్ సెంటర్ నందు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక చంద్రశేఖర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు మోదుగు ప్రభాకర్ మాట్లాడుతూ.. స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పెండ్యాల ప్రసాదరావు, మాజీ అధ్యక్షులు మహంకాళి గోపాలకృష్ణ, పట్టణ అధ్యక్షులు ఉడత పూర్ణచందరావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శులు సంఘం నాగరాజు, సిద్ధిక్, కోశాధికారి సిహెచ్ నరసింహారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ షఫీ, సభ్యులు బుడెన్ పాషా, అన్నవరపు జస్వంత్ కుమార్, శంకర్, యూసుఫ్, నజీర్, గోపి, హతిరామ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: