మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండల పరిధిలోని గిరిజన ఆశ్రమ హాస్టల్ వర్కర్స్ చేస్తున్న రెండవ రోజు నిరవధిక సమ్మెకు ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోయం కామరాజు మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసి గిరిజనుల మీద చిన్న చూపు చూస్తూ చిన్న ఉద్యోగస్తులపై చిత్తశుద్ధి లేకుండా వివరిస్తుందని మండిపడ్డారు వారితో అధిక పని భారం మోపి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం వస్తే కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెన్యువల్ చేస్తానని మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఆవేదన చెందారు గిరిజన హాస్టల్ లో వర్కర్లు ప్రధాన డిమాండ్లను తొమ్మిది నెలల బకాయిలను వెంటనే విడుదల చేసి తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డివిజన్ అధ్యక్షులు సోయం మల్లుదొర దుమ్ముగూడెం మండల అధ్యక్షుడు రవి నరసింహారావు దుమ్ముగూడెం ఎంపీటీసీ చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: