CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్రీస్తు పూర్వం మధ్య శిలాయుగం నాటి చిత్ర లిపిని గుర్తించిన బిరస ముండా యూత్ పరిశోధక బృందం

Share it:

 


క్రీస్తు పూర్వం మధ్య శిలాయుగం నాటి చిత్ర లిపిని గుర్తించిన బిరస ముండా యూత్ పరిశోధక బృందం

*ఇవి పురాతన గోండు లిపి గా నిర్ధారణ.

*సింధు నాగరికత చిత్రలిపితో డి కోడ్ చేశాం పరిశోధక విద్యార్థి మైపతి.అరుణ్ కుమార్. ఏ

టూరు నాగారం ఆగస్టు 29 మన్యం మనుగడ:

ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లో మధ్య భాగాన ఉండే పెద్ద గుట్ట అటవీ కేంద్రం లో ఇటు తాడ్వాయి,

కామరం అటు భూపతి పూర్, వెంకట పూర్ ఆదివాసి గ్రామాల సరిహద్దు ప్రాంతంలో గొంతెమ్మ అనే వాగు జల మొదలు అయ్యే దగ్గర ఒక గ్రానైట్ రాయి గుణం కలిగిన బండ రాయి పై పురాతన చిత్ర లిపి ఉంది అన్న సమాచారం తెలుసుకున్న బిరస ముండా యూత్ పరిశోధనకు బయలు దేరింది.2017 సంవత్సరం లో మొదటి సారి పరిశీలన చేసిన బృందం  దీనిపై పుస్తకం లో కూడా రాసిన క్రమం లో ఈ లిపిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయటానికి శనివారం రోజు 10 మంది  భాష శాస్త్రం,పురావస్తు శాస్త్రం, విద్యార్థుల పరిశోధక బృందం వెళ్లి అక్కడ ఉన్న చిత్ర లిపిని   సూక్ష్మ స్థాయిలో సుమారు 9 గంటల పాటు అధ్యయనం చేయటం జరిగిందని,ఆ సైట్ ను కూడా గూగుల్ మాప్ లో జత చేయటం జరిగిందని బిరస ముండా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కాక నర్సింహా రావు తెలిపారు.అనంతరం ఈ పరిశోధనని ఉధ్యేసించి కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి మైపతి

అరుణ్ కుమార్ మాట్లాడుతూ. ఈ పరిశోదన ప్రాంతాన్ని నేటికీ భారత పురావస్తు శాఖ గుర్తించలేదు అని అన్నారు. గుర్తించ డానికి కూడా వీలు లేని దట్టమైన అడవిలో ఉండటం ఒక కారణం అన్నారు.మేము దేశ వ్యాప్తంగా ప్రత్యక్ష పరిశోధనలు అనేకం చేసామని అందులో ఇటువంటి లిపి చాలా అరుదుగా ఉందని అన్నారు.దేశం లో రాక్ పెయింటింగ్స్ మరియు సింధు నాగరికత చిత్ర లిపి పై పురావస్తు శాఖ దగ్గర సమాచారం ఉంది కానీ ఇది మానవ జన్మ పుట్టుక అనంతరం భవిష్యత్ తరాలకు ఆదిమానవుడు అందించిన తొలి అక్షరం లిపి అని పేర్కొన్నారు.ఇటువంటి స్లాట్ మళ్లీ ఒరిస్సా నీలగిరి అటవీ ప్రాంతం లో మాత్రమే ఉందని అన్నారు.వీటిపై పరిశోధనలు జరిగితే ఇంకా అనేక పురాతన జీవన విధానం బయటికి వస్తుందని అన్నారు.మధ్య శిలాయుగం లో రాతి చిత్రాల వయస్సు క్రీస్తు పూ" 1 లక్ష సంవత్సారాలు అయితే ఇక్కడ చిత్ర లిపి లో పెట్రోగ్రిప్స్ ఆధారంగా క్రీస్తు పూర్వం ప్రాచీన యుగం లోని చివరిదశ అనగా క్రీస్తు పూర్వం 2 లక్షల సంవత్సరాల నాటివి అని పేర్కొన్నారు.స్త్రీ పురుషుల పాదాల గుర్తులు ఇక్కడ స్పష్టంగా ఉండటం దానిక నిదర్శనం అన్నారు.యుద్ద వీరుల చిత్రాలు,చంద్రుడు, నెలవంక,సూర్యుడు,కూడా ఈ లిపి లో ఉందని తెలిపారు. ఏనుగు బొమ్మ,పులిని తోక పట్టి బండ కి కొట్టి చంపే బొమ్మ, తాబేలు బొమ్మ, ఉడుము, బొమ్మ ఏనుగు బొమ్మ,ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయని ప్రస్తుత వెల్పు జాతర డాలు గుడ్డ(పడిగ) లో కూడా ఈ బొమ్మలు నేడు మనం చూడవచ్చు అని ఇవి కోయ పూర్వీకులు వేసిన బొమ్మలని తెలిపారు.

*సింధు నాగరికత చిత్ర లిపితో సంబంధం*

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అత్యంత వైభవం కలిగిన సింధు నాగరికత చిత్రలిపి బొమ్మలతో ఇక్కడి బొమ్మలు కనిపిస్తున్నాయి,సింధు నాగరికత కొయతూర్ ప్రజలు పాలించిన గోండు నాగరికత అనటానికి భవిష్యత్ లో ఇది ఒక బలమైన ఆధారం కానుంది.అత్యంత ప్రాచీన జీవన విధాన పద్ధతుల నుండి ఈ దేశం లో సింధు నాగరికత ఏర్పాటు అయిందని ఇది ఈ దేశం లో కి వచ్చిన వలస ఆర్యులు ఏర్పాటు చేసిన నాగరికత కాదు అనేది కూడా  మనం చెప్పటానికి బలమైన ఆధారం.

*ఆదిలాబాద్ గుంజాల గోండు లిపి తో సంబంధం*

ఆదివాసి ప్రజల కు లిపి లేదని భావించే క్రమం లో ఆదిలాబాద్ జిల్లాలో గుంజాల అనే గోండు గ్రామం 2006 న జనవరి 27 న బయట పడ్డ గోండు లిపి అత్యంత పురాతనమైనది అని నిర్ధారణ చేశారు తెలంగాణ భాష శాస్త్ర నిపుణులు,

హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత ఆదివాసి స్టడీ సర్కిల్ వారు పరిశోధించి అందించిన రిపోర్టుని తెలంగాణ వచ్చిన అనంతరం ప్రభుత్వ పరంగా కూడా గుర్తించారు.గుంజాల గోండు లిపి లో ఉన్న అక్షరాలు ఎడమ నుండి కుడికి రాయబడ తాయని,లిపి ఎడమ నుండి కుడికి ఇక్కడ బండపై రాసి స్పష్టంగా ఉన్నాయి అంటే ఆదివాసీలు ప్రాచీన యుగం లోనే అక్షరానికి జీవం పోశారు అని అర్థం చేసుకోవచ్చు.ఇంకా ఈ పరిశోదన లో సేకరించిన అంశాలను లిపిని సూక్ష్మ స్థాయి లో అధ్యయనం చేసి ఒక పుస్తక రూపంలోకి తీసుకు రావడంమే పురావస్తు శాఖకి కూడా ఒక రిపోర్ట్ రాసి పంపుతామని రీసెర్చ్  బృందం తెలిపింది.ఇక్కడ ఆనవాలను కొందరు బండలు సేకరించే వారు సుతే లతో కొట్టి ధ్వంసం చేస్తున్నారని వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు.

అటవీ శాఖ మాత్రమే ఈ ప్రాంతం నీ చేరుకోగలదని అందుకే అటవీ శాఖ ప్రత్యేకంగా దీనిని రక్షించాలిని బృందం పేర్కొంది.ఈ పరిశోధనలో బిరస ముండా యూత్ మహిళ అధ్యక్షురాలు కొర్నిబెల్లి,శ్వేతా,ఉపాధ్యక్షురాలు,పాయం అంజలి,రీసెర్చ్ సెంటర్ బాధ్యులు కొమరం, జ్యోతిష్,కాక నవ్య,కోర్నిబెల్లి,

సందీప్,గైడ్ కొర్నిబెల్లి,

ఆదినారాయణ,రీసెర్చ్ సెంటర్ ఫోటోగ్రాఫర్ ఉసం సతీష్ తది తరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: