మన్యం మనుగడ, మంగపేట. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అన్ని స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్ మెంటును వెంటనే విడుదల చేయాలని "భారత విద్యార్థి ఫెడరేషన్" (ఎస్.ఎఫ్.ఐ) మంగపేట మండలం నాయకులు వి, సిద్దు అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్ మెంటు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. దీనివలన ప్రైవేటు కళాశాలలలో చదువుకునే పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థుల కు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ రాకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్ల దగ్గర డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామని విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులుపెడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగాన్ని గాలికి వదిలేసింది అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ పాలనకొనసాగిస్తుందన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఎస్ఎఫ్ఐ అధ్వరంలో దశల వారిగా పోరాటాలు చేస్తామని నిశ్చయిoచారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అంజి,వంశీ, సైలామ్, ఉగెందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: