CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్న విశ్వాతేజ డిగ్రీ కళాశాల ను వెంటనే మూసివేయాయాలి.స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

విశ్వతేజ డిగ్రీ కళాశాల యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని "భారత విద్యార్థి ఫెడరేషన్" (ఎస్. ఎఫ్.ఐ)ఆధ్వరంలో సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ గణేష్ కి ఓ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కన్వీనర్ తోకల రవి మాట్లాడుతూ..దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని విశ్వ తేజ కళాశాలలో విద్యార్థులకు 2021 నుంచి 2022 గత విద్యాసంవత్సరం కాలంగా ఎలాంటి తరగతులు నిర్వహింటం లేదని,తరగతులు నిర్వహించక పోవటం వల్ల విద్యార్థులు అందరు డిగ్రీ పరీక్షలు కూడా ఫెయిల్ అయ్యారన్నారు. కళాశాల యాజమాన్యం కళాశాలను నడిపించడంలో ఎలాంటి హామీ విద్యార్థులకు ఇవ్వటం లేదని, తరగతులు నిర్వహించకుండా సర్టిఫికేట్స్ ఇవ్వకుండా రేపు మాపు అని కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. అలాంటి విశ్వతేజ డిగ్రీ కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోని విద్యార్ధులకు సర్టిఫికేట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల ఎస్. ఎఫ్.ఐ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్. ఎఫ్.ఐ నాయకులు రమేష్ ,రాకేష్ ,విద్యార్ధులు,నవత,నవ్య,శ్రీవిద్య, రచన,సౌజన్య, రామ కిషోర్ , నాగరాజు, సాయి చరణ్,లక్ష్మణ్,శ్రీను, కార్తిక్, ఆనంద్, తదితరులు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: