CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్సీ ఎస్టీ కమిషన్ నియామకానికి ఇంకెన్నేళ్లకు మోక్షం

Share it:



  • ఎస్సీ ఎస్టీ కమిషన్ నియామకానికి ఇంకెన్నేళ్లకు మోక్షం
  • రాజమల్ల సుకుమార్ తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ములుగు

మన్యం, మనుగడ, మంగపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో 25 శాతం ఉన్న షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఎస్సీ ఎస్టీ రక్షణ సంక్షేమ రిజర్వేషన్ చట్టాల అమలులో జరుగుతున్న అన్యాయాలను అధిగమించేందుకు కమిషన్ ఆశ్రయించే వర్గాల వారికి పూర్తి స్థాయి కమిషన్ లేకపోవడంతో సరైన న్యాయం జరగడం లేదు. ఎస్సీ ఎస్టీల వర్గాలకు వెంటనే న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో జాతీయస్థాయిలో ఉమ్మడిగా ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ 2006లో జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ అని రెండుగా విభజించి రెండు వర్గాలకు రాజ్యాంగ  బద్దంగా ఆ కమిషన్ తన సేవలను అందిస్తున్నామని చెబుతోంది, అయితే నిబంధనలకు అనుగుణంగా ఈ సేవలు లేవు. ఇరు వర్గాల వారికి ప్రతిఫలాలు చేరటం లేదు, అందుకే వీలైనంతఎస్సి, ఎస్టీ కమిషన్ త్వరగా ఏర్పాటు చర్యలు చేపడితే మంచిది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాల గుర్తించి పూర్తి చిత్తశుద్ధితో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నో కేసుల్లో బాధితులకు అండగా నిలుస్తూ 2019లో  ఎస్సీ,ఎస్టీ వర్గాలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్టి కమిషన్ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం 02-02-2018 తేదీన సాధారణ పరిపాలన శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 6 ద్వారా చైర్మన్ ఐదుగురు సభ్యులతో కూడిన కమీషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మూడేళ్ళ కాల పరిమితి పూర్తి కావడంతో తేదీ 26 ఫిబ్రవరి 2021తో పదవికాలం పూర్తి అయిపోయింది, అయినా ప్రభుత్వం కమిషన్ ను మరల తిరిగి నియమించకపోవడం బాధాకరం. కమిషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన దాదాపు 4 నుoచి 5 వేల పిటీషన్లు ఏలాంటి విచారణకు నోచుకోకుండా నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి. గంపెడు ఆశతో ఎన్నో వ్యయ  ప్రయాసలతో హైదరాబాద్ కు వచ్చి కమిషన్ లో పిర్యాదు చెయ్యగానే   తమకు మేలు జరుగుతుంది అనే ఆశతో ఇళ్లకు వెళ్లిన బాధితులకు వారి ఆశలు అడియాశలు అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ సమయంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు ఈ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టం 2003 (యాక్ట్  9ఆఫ్ 2003) నిబంధన చాప్టర్-2 రూల్(5)(1) (ఏ) ప్రకారం చైర్మన్ మరియు సబ్ రూల్ బి ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం అందించేందుకు సమర్ధత పూర్తి చిత్తశుద్ధి నిస్వార్థ సేవలందించే ఐదుగురు వ్యక్తులను కమిషన్ సభ్యులుగా నిర్వహించవలసిందిగా  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కోరుతున్నాను అని తెలంగాణా మాల మహానాడు అధ్యక్షులు రాజమళ్ళ సుకుమార్ ఈ సందర్బంగా తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: