మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల ప్రజలకు 31వ తేదీ వినాయక చవితి సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొనే వినాయక చవితి పండుగను, మట్టి విగ్రహాలనే వాడాలని, పర్యావరణాన్ని రక్షించాలనీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఈ ఒక్క పండుగను మట్టి విగ్రహాలతోనే జరిపి, అలాగే గణేష్ మండపాలు నిర్వహించే వారు కచ్చితంగా కరెంట్, విద్యుత్, రెవెన్యూ అధికారులకు సహకరించి పర్మిషన్ తీసుకువాలనీ, భక్తి గీతాలు పెట్టుకునేందుకు మైక్ సెట్ అనుమతి తీసుకోవాలని మరియు గణేష్ మండపాల దగ్గర పెట్టీ లైటింగ్ కి ఎల్ఈడి లైట్లనే వాడాలని కావున భక్తులందరూ సహకరించి ఈ పండగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో కూడ పర్మిషన్ ప్రకారం అధికారులతో సమన్వయంతో సహకరించి ఈ ఒక్క వినాయక చవితి పండుగను జరుపుకోవాలని మండల ప్రజలను ఆయన కోరారు.
Post A Comment: